CM Jagan Congratulate On AP Mines Department Gets National Award - Sakshi
Sakshi News home page

ఏపీ గనుల శాఖ భేష్‌.. జాతీయ అవార్డుపై సీఎం జగన్‌ సంతోషం

Published Fri, Jul 22 2022 1:13 PM | Last Updated on Fri, Jul 22 2022 2:09 PM

CM Jagan Congratulate On AP Mines Department Gets National Award - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ గనుల శాఖ మంత్రి, సంబంధిత అధికారులపై అభినందనలు గుప్పించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు, గుర్తింపు దక్కాయి. ఈ నేపథ్యంలో..

ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్‌  కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ‘ఖనిజ వికాస్‌’ అవార్డు దక్కింది. ఇటీవల ఢిల్లీలో మైన్స్‌ అండ్‌ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ.వెంకటరెడ్డిలు. 

ఖనిజ వికాస్‌ అవార్డు క్రింద కేంద్ర గనుల శాఖ అందజేసిన రూ. 2.40 కోట్ల ప్రోత్సాహక చెక్‌ను తాజాగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌కు చూపించారు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, డెరెక్టర్‌ వీజీ.వెంకటరెడ్డిలు. ఈ క్రమంలో సీఎం జగన్‌ గనుల శాఖను అభినందిస్తూ.. ఇలాగే ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement