
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది జాతీయ స్థాయి క్రికెటర్లు తయారు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులున్నారని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
జాతీయ స్థాయిలో రాణించేందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించాలని, వారికి సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి గోపినాథ్‌రెడ్డికి సూచించారు. గురువారం విశాఖ పర్యటన సందర్భంగా సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహిళా క్రికెటర్లకు నగదు ప్రోత్సాహం
గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలుత పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వద్ద దివంగత వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జాతీయ మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి, అండర్–19 వరల్డ్ కప్ క్రికెట్ కప్‌లో ఆడిన షబ్నంకు రూ.10 లక్షల చొప్పున నగదుతో పాటు జ్ఞాపిక అందించి సత్కరించారు. క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో పాటు క్రీడాకారులతో సీఎం జగన్ ఆతీ్మయంగా సమావేశమయ్యారు. వారిని పేరుపేరునా పలకరించారు. మరింత రాణించేలా ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని హామీనిచ్చారు.
బీచ్ రోడ్డులో ‘సీ హారియర్’
విశాఖ బీచ్ రోడ్డులో రూ.10 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సీ హారియర్’ యుద్ధ విమానాల మ్యూజియంను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యుద్ధ విమానాలకు చెందిన విడి భాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వబిత్ దాస్‌గుప్తాను అడిగి తెలుసుకున్నారు. రూ.25.50 కోట్లతో ఎంవీపీ కాలనీలో నిరి్మంచిన ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాకు అక్కడి నుంచే సీఎం ప్రారం¿ోత్సవం చేశారు. రూ.13.5 కోట్లతో అభివృద్ధి చేసిన వీఎంఆర్‌డీఏ వాణిజ్య సముదాయాన్ని కూడా ప్రారంభించారు. రూ.24.86 కోట్లతో భీమిలిలో ఏర్పాటు కానున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment