సాక్షి, వైఎస్సార్ జిల్లా: గండికోటను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నామని, ఒబెరాయ్ వంటి పెద్ద కంపెనీలు గండికోటలో స్టార్ హోటల్ ఏర్పాటు హర్షణీయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్ జిల్లా గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ఆయన సభలో మాట్లాడుతూ.. ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం అన్నారు, స్టార్ గ్రూపుల రాకతో గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తామన్నారు.
‘‘గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుంది. ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు కలుగుతుంది. గండికోటకు మరో స్టార్ గ్రూప్‌ను కూడా తీసుకొస్తాం. కొప్పర్తి డిక్సన్ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు. కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు(సోమవారం) ఎంవోయూలు చేసుకుంటాం. గండికోటలో గోల్ఫ్ కోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఒబెరాయ్‌ని కోరా. త్వరలో కడప స్టీల్‌ఫ్యాక్టరీకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాబోతుంది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
చదవండి: రైతు రాజ్యమా? తోడేళ్ల పాలనా?
Comments
Please login to add a commentAdd a comment