సాక్షి, తాడేపల్లి: వలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు గ్రామ వలంటీర్లు అద్భుతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. వలంటీర్ల మెరుగైన పనితీరును చూసి గర్విస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ‘ఏడాది క్రితం రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, లబ్దిదారుల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలు అందించే ప్రయాణాన్ని ప్రారంభించాం. ఏడాది ప్రయాణంలో మెరుగైన పనితీరు కనబర్చిన మా #APVillageWarriors కృషి పట్ల గర్వంగా ఉంది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు చక్కగా పనిచేశారు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (చదవండి: అంతులేని విషాదం)
1 year ago, we embarked upon a journey of corruption-free governance & last-mile
— YS Jagan
delivery of services to every household of AP. We've come a long way since then. Proud of our href="https://twitter.com/hashtag/APVillageWarriors?src=hash&ref_src=twsrc%5Etfw">#APVillageWarriors & the tremendous work
they've been doing, especially in the face of adversity. pic.twitter.com/qaSudYJeTP
Mohan Reddy (@ysjagan) August 15, 2020
Comments
Please login to add a commentAdd a comment