వైద్యం.. సువర్ణాధ్యాయం | Filling of 54 thousand posts in medical field: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వైద్యం.. సువర్ణాధ్యాయం

Published Sun, Apr 28 2024 5:59 AM | Last Updated on Sun, Apr 28 2024 5:59 AM

Filling of 54 thousand posts in medical field: Andhra Pradesh

వైద్య రంగాన్ని కుదేలు చేసిన గత చంద్రబాబు ప్రభుత్వం 

ప్రభుత్వ ఆస్పత్రులను ఏమాత్రం పట్టించుకోని వైనం 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే పూర్తిగా ప్రక్షాళన 

నాడు–నేడు ద్వారా వసతుల కల్పన, భారీగా వైద్యుల నియామకం 

పల్లె ప్రజలకు కొండంత భరోసానిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ 

రాష్ట్ర వైద్య రంగంలో ఫలించిన సీఎం జగన్‌ యజ్ఞం 

17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో రికార్డు 

ఇప్పటికే 5 కళాశాలలు ప్రారంభం.. రెండేళ్లలో మిగతావి అందుబాటులోకి.. 

ఫ్యామిలీ డాక్టర్‌తో పల్లె చెంతకే వైద్యం.. రోగుల వద్దకే చికిత్స 

10,032 విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటుతో గ్రామాల్లోనే వైద్య సేవలు 

అందుబాటులో 105 రకాల మందులు.. 14 రకాల పరీక్షలు 

స్పెషలిస్టు వైద్యులతో జగనన్న ఆరోగ్య సురక్షలో 98 లక్షల మందికి సేవలు 

వైద్య రంగంలో 54 వేల పోస్టుల భర్తీ 

ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చేలా రూ.16,880 కోట్లతో ‘నాడు–నేడు’ 

నాడు..
ప్రజారోగ్య పరిరక్షణ ధర్మాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని విస్మరించింది.  దివంగత సీఎం వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అంపశయ్యపైకి ఎక్కించింది. ఈ క్రమంలో ఏదైనా జబ్బు చేస్తే అప్పులు చేయాలి, అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోవాలి. ఆస్తులు లేని వాళ్లు దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాలి.

రాష్ట్ర విభజనను బూచిగా చూపి 2014–19 మధ్య ఆర్థిక పరిస్థితులు బాగోలేవంటూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయలేమని చేతులు ఎత్తేశారు. 108, 104 వ్యవస్థకు పాతరేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టలేదు. వసతులు కల్పించలేదు. అత్యవసర మందులు సైతం అందుబాటులో ఉంచలేదు. పారాసెటిమాల్‌ టాబ్లెట్‌ కావాలన్నా బయట తెచ్చుకోండని చీటీ రాసిచ్చే దుస్థితి. చిన్న పిల్లలను ఎలుకలు కొరికేసే పరిస్థితి. అయినప్పటికీ ఆ అధ్వాన్న పరిస్థితులే అద్భుతం అంటూ రామోజీ, ఎల్లో మీడియా బాబును ఆకాశానికి ఎత్తాయి.  

నేడు..
 ఈ అధ్వాన్న పరిస్థితులను చక్కబెడుతూ ఈ ఐదేళ్ల పాలనలో నాడు–నేడు ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరుల కొరతకు ప్రణాళికా బద్ధంగా చెక్‌ పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదారు. పేదలు దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడితే వారి చికిత్సల బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునే గొప్ప వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా తినేసింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినింది. అయినప్పటికీ ప్రజారోగ్యం విషయంలో వైఎస్‌ జగన్‌ ఏ మాత్రం రాజీ పడలేదు. మన ఇంట్లో వాళ్లకు ఎవరికైనా జబ్బు చేస్తే ఎలాంటి వైద్యం ఆశిస్తామో.. ఆ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్యం అందించాలనే తాపత్రయంతో ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కాన్సెప్‌్టకు శ్రీకారం చుట్టారు. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సాధ్యం కాని ఈ విధానం ఏపీలో దిగి్వజయంగా అమలవుతుండటం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఉంటారో లేదో? తమ జబ్బు నయమవుతుందా? అని ఒకప్పుడు సామాన్యుడు సర్కారు దవాఖానా అంటే ముఖం చాటేసేవాడు. ఆ దుస్థితి నుంచి ప్రభుత్వ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించే స్థాయికి నేడు వైద్య రంగం అభివృద్ధి చెందింది. నాడు–నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమం, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి వినూత్న విధానాలు పేదోడి వైద్యానికి ఊపిరిపోశాయి.

ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ఈ ఐదేళ్ల వ్యవధిలో పేద, మధ్య తరగతికి కావాల్సింది జగన్‌ చేసి చూపించారు. 17 మెడికల్‌ కళాశాలల ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతికి వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు మెడికల్‌ కాలేజీ ఆస్పత్రులతో అత్యాధునిక వైద్యం చేరువ చేశారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పం సీఎం జగన్‌ది.. అందుకే ఆయన యజ్ఞం ఫలించింది. 

► ఉమ్మడి విజయనగరం జిల్లా జనాభా 20 లక్షలకు పైనే.. అయితే జిల్లాలో ఒక్క ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి లేదు. మెరుగైన వైద్యం అవసరమైతే విశాఖపట్నం వెళ్లాల్సిందే. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఒక వైద్య కళాశాల మంజూరు చేయాలని అసెంబ్లీ వేదికగా అడిగితే.. రాష్ట్ర ఆరి్థక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు.. ప్రైవేట్‌ వైద్య కళాశాలకు అనుమతి ఇస్తున్నామని అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని సమాధానమిచ్చారు. 

►ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విజయనగరంలో రూ.500 కోట్లతో కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి.. 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభించారు. ఇప్పుడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా అక్కడ వైద్య సేవలందుతున్నాయి.  

► జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల.. ఇంతవరకూ ఏ ప్రభుత్వం చేయని సాహసం.. ఏజెన్సీ అయినా, వెనుకబడిన ప్రాంతమైనా.. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, ఖరీదైన వైద్యం ఉచితంగా అందాలనే సంకల్పంతో ఖర్చు ఎంతయినా వెనకాడకుండా.. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించగా.. 2024–25లో 5, 2025–26లో 7 వైద్య కళాశాలలు ప్రారంభించనున్నారు. 

కొత్తగా 17 మెడికల్‌ కళాశాలలు 
స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు 11. సీఎం జగన్‌ పాలన వచ్చాక ఏకంగా 17 కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.8,480 కోట్లతో వీటి నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రంలో ఒకే ఏడాది 5 వైద్య కళాశాలలను ప్రారంభించి సీఎం జగన్‌ కొత్త రికార్డు సృష్టించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్‌ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. 1923లో రాష్ట్రంలో మొదటిగా ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి.

సీఎం జగన్‌ మాత్రం కేవలం ఐదేళ్లలో 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ ఐదు వైద్య కళాశాలల ఏర్పాటు కోసం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)కి దరఖాస్తు చేశారు. త్వరలో తనిఖీలు చేస్తారు. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు వీలుగా చర్యలు మొదలు పెట్టారు.

కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్య విద్య చదివేందుకు అవకాశం కల్పించడమే కాకుండా.. పరిసర ప్రాంతాల్లోని పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువవుతాయి. కొత్తగా ప్రారంభించే కళాశాలల్లో ఎంబీబీఎస్‌ బ్యాచ్‌ పూర్తయ్యి బయటకు వచ్చే సమయానికి 600 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కొత్త బోధనాస్పత్రుల్లో కిడ్నీ, న్యూరో, కార్డియాలజీ, క్యాన్సర్‌ లాంటి సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల ఏర్పాటుతో వివిధ వ్యాధుల నిర్ధారణ సులభతరమవుతుంది.

సూపర్‌హిట్‌.. ఫ్యామిలీ డాక్టర్‌
ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తూ సీఎం జగన్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులకు తమ పరిధిలోని వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ బాధ్యతలను అప్పగించారు. రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్‌ క్లినిక్‌లకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. 104 వాహనంతో పాటు వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీ సేవలు, అనంతరం కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యం వాకబు చేస్తున్నారు. టెలిమెడిసిన్‌ కన్సల్టేషన్‌ ఇక్కడ అందుబాటులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులో విలేజ్‌ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.  

3.83 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌రన్‌ 2022 అక్టోబర్‌ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో గత ఏడాది ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చింది.ఇంతవరకూ పీహెచ్‌సీ వైద్యులు 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ను సందర్శించి 3,83,19,985 మందికి వైద్య సేవలు అందించారు. 

‘ఫ్యామిలీ డాక్టర్‌’లో అందే వైద్య సేవలు 
► జనరల్‌ అవుట్‌ పేషెంట్‌ సేవలు 
► బీపీ, సుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్‌ 
► గర్భిణులకు యాంటినేటల్‌ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్‌ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు 
► చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు 
► రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు 
► ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం  
► పాలియేటివ్‌ కేర్‌ 4 తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌ నిర్ధారణ 
► 2,500 జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను నెలకొల్పారు. 

ఫ్యామిలీ డాక్టర్‌లో సేవలు 
విభాగం           వైద్య సేవలు
జనరల్‌ ఓపీ    1,01,36,801 
గర్భిణులు       28,76,014 
బాలింతలు     8,81,412 
రక్తహీనత       1,63,368 
బీపీ                95,32,752 
సుగర్‌             57,23,906 
బీపీ, సుగర్‌    87,03,543 

గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు  
► గర్భ నిర్ధారణకు యూరిన్‌ టెస్ట్‌  హిమోగ్లోబిన్‌ టెస్ట్‌ సుగర్‌ పరీక్ష  
► మలేరియా పరీక్ష హెచ్‌ఐవీ నిర్ధారణ డెంగ్యూ టెస్ట్‌ మల్టీపారా యూరిన్‌
► స్ట్రిప్స్‌ (డిప్‌ స్టిక్‌) అయోడిన్‌ టెస్ట్‌ వాటర్‌ టెస్టింగ్‌ హెపటైటిస్‌ బీ నిర్ధారణ 
► ఫైలేరియాసిస్‌ టెస్ట్‌ సిఫిలిస్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ విజువల్‌ ఇన్‌స్పెక్షన్‌ స్పుటమ్‌ (ఏఎఫ్‌బీ) 

పార్వతీపురం మన్యం జిల్లాలోని బొబ్బిలి సామాజిక కేంద్రం(సీహెచ్‌సీ) చుట్టుపక్కల ఆరు మండలాల రోగులకు ఆధారం. గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ముగ్గురు లేదా నలుగురు వైద్యులు మాత్రమే పనిచేసేవారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. ఓపీ బ్లాక్‌ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో నూతన భవనం నిర్మించారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రికి దీటుగా నిర్మించారు. ఓపీ, ల్యాబ్, సర్జికల్, లేబర్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేశారు. పడకల సామర్థ్యం 50కు పెంచి తొమ్మిది మంది వైద్యులను సమకూర్చారు.  

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఏరియా ఆస్పత్రిని గత టీడీపీ ప్రభుత్వంలో 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతామని హామీలిచ్చి గాలికి వదిలేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 100 పడకలకు ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేశారు. రూ.13 కోట్లతో నాడు–నేడులో మాతా శిశు సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఉండే 100 పడకలకు నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది. 2022లో ఈ విభాగాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. లేబర్‌ రూమ్, ఆపరేషన్‌ థియేటర్‌లతో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కార్పొరేట్‌ ఆస్పత్రులను తలదన్నేలా వార్డులు, ఆపరేషన్‌ థియేటర్‌లు, లేబర్‌ రూమ్, ఇతర వసతులను సమకూర్చారు.

మానవ వనరుల కొరతకు చెక్‌ 
2019 నుంచి ఇప్పటి వరకు వైద్యశాఖలో 54 వేల పోస్టులను భర్తీ చేశారు. బాబు హయాంలో కేవలం 4,469 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. నేడు ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు సహా 14 మంది సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.  దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత తీవ్రంగా ఉండగా.. ఏపీలో 94.6 శాతం స్పెషలిస్ట్‌ వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నారు.

రూ.వేల కోట్లతో అత్యాధునిక పరికరాలు 
108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్‌లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్‌ అమలుకోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. రూ.1685.95 కోట్లతో ఆస్పత్రులకు కంప్యూటర్‌లు, ఇతర ఐటీ పరికరాలు సరఫరా చేశారు. విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలకు రూ.218.16 కోట్లతో మెడికల్‌ పరికరాలు అందించారు.

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి రూ.131.27 కోట్లతో పరికరాలు సమకూర్చారు. కేజీహెచ్, కర్నూలు, కాకినాడ జీజీహెచ్‌లకు రూ.46.11 కోట్లతో సీటీ, ఎంఆర్‌ఐ, క్యాథ్‌ల్యాబ్‌ సేవలను ప్రారంభించారు. క్యాన్సర్‌ వైద్యాన్ని బలోపేతం చేస్తూ రూ.190 కోట్లతో కేజీహెచ్, కర్నూలు, కడప ఆస్పత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలు అందిస్తున్నారు. రూ.193.50 కోట్లతో ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ఐసీయూల అభివృద్ధి చేపట్టారు.  

డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల మేరకు మందులు 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఆస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. టీడీపీ హయాంలో 2014–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఏడాదికి సుమారు రూ.216 కోట్లు మాత్రమే వెచ్చించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్ల వ్యయం  

ఆరోగ్య సురక్షలో 6.45 కోట్ల వైద్య పరీక్షలు  
అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. గ్రామాల్లోని జగనన్న సురక్ష శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో వైద్యం అవసరం ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ కార్యక్రమం ప్రవేశపెట్టగా తొలి దశలో 60,27,843 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలు సందర్శించి స్క్రీనింగ్‌ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసి ఉచితంగా చికిత్సలు అందించారు. ఆస్పత్రులకు వెళ్లి సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కోసం రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. ఈ ఏడాది జనవరిలో రెండో దశ సురక్షను ప్రారంభించగా.. ఇంతవరకూ 10,881 శిబిరాలు నిర్వహించారు.  

రూ.16,880 కోట్లతో నాడు–నేడు
తానిచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్‌ నాడు–నేడులో ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. అధ్వానంగా ఉన్న ఆస్పత్రులను ఐదేళ్లలో చక్కదిద్దారు. భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం ఏకంగా రూ.16,880 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. 640 ఆస్పత్రులకు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ (ఎన్‌క్వా‹Ù), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలుస్తోంది. కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. 

జగనన్న ఆరోగ్య సురక్ష –1లో సేవలు 
నిర్వహించిన శిబిరాలు –    12,423
మొత్తం ఓపీలు –    60,27,843
నిర్వహించిన వైద్య పరీక్షలు–    6,45,06,018
మెరుగైన వైద్యం కోసం సిఫార్సు–    1,66,828
జనరల్‌ సిఫార్సులో పూర్తయిన చికిత్సలు–    86,053
కేటరాక్ట్‌ సిఫార్సులో పూర్తయిన చికిత్సలు–    80,115
కంటి స్క్రీనింగ్‌–    9,52,066 (5.73 లక్షల మందికి అద్దాలు పంపిణీ)
కొత్తగా గుర్తించిన బీపీ కేసులు–    2,51,529
కొత్తగా గుర్తించిన సుగర్‌ కేసులు–    1,54,248

జగనన్న ఆరోగ్య సురక్ష –2లో సేవలు 
నిర్వహించిన సురక్ష శిబిరాలు–    10,881 
ఓపీలు–    38,58,410 
నిర్వహించిన పరీక్షలు–    88,83,316 
మెరుగైన వైద్యానికి సిఫార్సు–    17,558 
సిఫార్సులో పూర్తయిన చికిత్సలు–    8,699 
కళ్లద్దాలు అవసరమని గుర్తింపు–    2,09,319 
అద్దాలు పంపిణీ–    1,70,594

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement