సాక్షి, విశాఖ/హైదరాబాద్: బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోంది. దీంతో ప్రభావంతో తీరం వెంబడి తీవ్రమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక, అల్ప పీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో(andhra Pradesh) విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు విస్తరంగా వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అల్ప పీడనం ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, పలు జిల్లాలో వర్షాలకు అవకాశం ఉంది. ఇదే సమయంలో దక్షిణ కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరించింది. ఇక, అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక, తెలంగాణపై(telangana) కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. దీంతో, వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment