Live Updates
ఏపీలో అరాచకం.. ‘ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆగదు’
వైఎస్సార్‌సీపీలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
- సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
- వైఎస్ జగన్ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
న్యాయ సహాయం కల్పించడం, భరోసా ఇవ్వడం, ఆత్మస్థైర్యాన్ని పెంచేలా పనిచేయనున్న టాస్క్‌ఫోర్స్
జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్ వివరాలు
- శ్రీకాకుళం: సీదిరి అప్పలరాజు, శ్యామ్.
- విజయనగరం: బెల్లాని చంద్రశేఖర్, జోగారావు
- విశాఖపట్నం: భాగ్యలక్ష్మి, కెకె రాజు
- తూర్పు గోదావరి: జక్కంపూడి రాజా, వంగా గీత
- పశ్చిమ గోదావరి: కె.సునిల్‌కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపి)
- కృష్ణా: మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి
- గుంటూరు: విడదల రజని, డైమండ్ బాబు
- ప్రకాశం: టీజేఆర్ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి
- నెల్లూరు: రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ఎమ్మెల్సీ)
- చిత్తూరు: గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
- అనంతపురం: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్
- కడప: సురేష్‌బాబు, రమేష్‌యాదవ్
- కర్నూలు: హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి
టీడీపీ గూండాల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడిన వైఎస్ జగన్
- టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.
- పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో పొలం నుంచి వస్తున్న నర్రెడ్డి లక్ష్మారెడ్డిపై టీడీపీ గూండాలు పాశవికంగా దాడి
- నర్రెడ్డి లక్ష్మారెడ్డితో మాట్లాడి దాడి వివరాల్ని తెలుసుకున్న వైఎస్ జగన్.
పార్టీ అండగా ఉంటుందని భరోసా
.@JaiTDP గూండాల దాడిలో గాయపడిన వైయస్ఆర్సీపీ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించిన పార్టీ అధ్యక్షులు @ysjagan గారు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో పొలం నుంచి వస్తున్న నర్రెడ్డి లక్ష్మారెడ్డిపై టీడీపీ గూండాలు పాశవికంగా దాడి
నర్రెడ్డి లక్ష్మారెడ్డితో… pic.twitter.com/8KJ9T2K4qv— YSR Congress Party (@YSRCParty) November 14, 2024
వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు
- అక్రమ కేసు బనాయించిన విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు
- అర్థరాత్రి వేళ దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు
- ఆయన ఇంట్లో లేని సమయంలో పోలీసుల ఎంట్రీ
- గౌతమ్ రెడ్డి భార్యను భయాందోళనకు గురిచేసిన పోలీసులు
వైఎస్సార్ జిల్లా.. కీలక నేతలపై మరో కేసు
- వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై మరో ఎస్సీ, ఎస్టీ కేసు
- వైఎస్సార్ జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.
- సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్, పవన్ కల్యాణ్ పై కామెంట్లు చేశారని ఆరోపణ
- సిద్ధవటం మండలానికి చెందిన వాకమల్ల వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ వెంకటేశ్వర్లు.
తూ.గో.: పీటీ వారెంట్‌పై ఇంటూరి తరలింపు
- సోషల్ మీడియా యాక్టివిస్టుల పై కక్ష సాధింపు కొనసాగిస్తున్న ప్రభుత్వం
- రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ ను పిటి వారెంట్ పై కురుపాం తరలింపు
- ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు
రాజకీయ ఎజెండాలతోనే ఈ అరెస్టులు: విజయసాయిరెడ్డి
- ఏపీలో చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు
- ఏపీలో కూటమి పాలనలో నిత్యం అఘాయిత్యాలు, పెరిగిన సైబర్ నేరాలు
- పట్టించుకోని పోలీస్ వ్యవస్థ
- రాజకీయ స్వార్థంతో ప్రజా భద్రతను గాలికొదిలేసిన వైనం
- పొలిటికల్ ఎజెండాతో పని చేస్తున్న పోలీసులు
- ఉద్దేశపూర్వకంగానే.. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు
- ఇప్పటిదాకా 680 మందికి నోటీసులు, 147 కేసులు, 49 మంది అరెస్ట్
The priorities of the AP Police are misplaced. Amid rising crimes against women and increasing cybercrimes, the AP police is diverting significant resources to further TDP’s political agenda—serving notices to 680 YCP social media activists, filing 147 cases, and arresting 49…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2024
వైఎస్సార్ జిల్లా: ఎన్ని కేసులైనా పెట్టుకోండి
- సోషల్ మీడియాలో టీడీపీ వారు పెట్టిన అసభ్యకర పోస్టులపై ప్రొద్దుటూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.
- నాపై గతంలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలి: రాచమల్లు
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చవరకు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటాం: రాచమల్లు
- మేము మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరమూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము: రాచమల్లు
- ఎంతమంది పై కేసులు పెడతారో పెట్టుకోండి: రాచమల్లు
- ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాము: రాచమల్లు
- మా పార్టీ ప్రతి కార్యకర్త,నాయకులకు మేము అండగా ఉంటాము: రాచమల్లు
విశాఖ: ప్రశ్నించిన పోసానిపై కేసు
- విశాఖ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో పోసాని కృష్ణమురళీ పై కేసు నమోదు
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,లోకేష్, ఈటీవీ రామోజీరావు, టీవీ5 చైర్మన్.. ప్రస్తుతపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీద మాట్లాడారని ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి
- ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ సీఐ జీడీ బాబు
అనంతపురం: మఫ్టీలో వచ్చి మరీ అరెస్ట్!
- సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు
- రాయదుర్గం మండలం ఆయతపల్లిలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రసాద్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మఫ్టీలో వచ్చి ప్రసాద్ రెడ్డి ని తీసుకెళ్లిన పోలీసులు
- అర్ధరాత్రి వదిలేసి.. మళ్లీ ఉదయాన్నే రావాలన్న పోలీసులు
- సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల తీరును ఖండించిన వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి
నెల్లూరు: వరుసగా వైఎస్సార్‌సీపీ వాళ్లపై కేసులు
- సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై కొనసాగుతున్న అక్రమ కేసుల పర్వం
- నెల్లూరులో YSRCP కార్యకర్త కేసు
- సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హోం మంత్రి. ఐటీ శాఖ మంట్రీ లోకేష్ లపై పోస్టులు పెట్టారని
కీసర రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు - కేసు నమోదు చేసిన రెండో పట్టణ పోలీసులు
విశాఖ: అధైర్య పడొద్దు అండగా ఉంటాం
- YSRCP సోషల్ మీడియా యాక్టవిస్ట్ వెంకటేష్ కుటుంబ సభ్యులు ను పరామర్శించిన మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్
- వెంకటేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అమర్ నాథ్
- అధైర్య పడొద్దని.. బాధితు కుటుంబానికి అండగా వైఎస్సార్సీపీ పార్టీ ఉంటుందని అమర్నాథ్ హామీ
నెల్లూరు: తారాస్థాయికి వేధింపులు!
- నెల్లూరు జిల్లా కందుకూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించిన డీఎస్పీ
- కందుకూరు సోషల్ మీడియా కార్యకర్త అయూబ్ ఖాన్ పై కేసు నమోదు చేస్తున్నామంటూ రాత్రి 12:00 వరకు స్టేషన్లో ఉంచి పంపించిన సీఐ.
- ఉదయాన్నే మరల పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొన్న పోలీసులు