సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబరు అందించింది. తెలంగాణ, ఏపీలో రెండు రోజుల పాటు అక్కడకక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో పలు చోట్లు వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Clouds are forming the border of Telangana, Andhra ,chhattisgarh and orrisa with increase in some heat result in some good isolated spell over these areas in the coming 2 days. #Rains pic.twitter.com/Uqcwd397d5
— SadhuWeatherman (@abhiramsirapar2) February 23, 2024
Comments
Please login to add a commentAdd a comment