
బంగారు పతకంతో షేక్ మెహద్
అల్లూరు: సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు వాసి సత్తా చాటాడు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి, రూ.2 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. ఆ దేశ క్రీడారంగం చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి తెలుగు వాడిగా అల్లూరు కోనేటిమిట్టకు చెందిన షేక్ షాహీద్, షాకీరా బేగం కుమారుడు మెహద్ (17) అరుదైన రికార్డు సృష్టించాడు.
సౌదీ అరేబియా ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు, సౌదీ క్రీడల డైరెక్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. షేక్ మెహద్ తండ్రి సివిల్ ఇంజనీర్‌గా రియాద్ (సౌదీ)లో పనిచేస్తున్నాడు. తల్లి షాకీరా బేగం హైదరాబాద్‌లో ఉంటున్నారు. మెహద్ రియాద్ నగరంలో తండ్రితో ఉంటూ పదకొండో తరగతి చదువుతున్నాడు. మెహద్ స్పోర్ట్స్ కోటాలో హైదరాబాద్‌కు వచ్చి గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మెహద్ స్వర్ణ పతకం సాధించడంపై అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment