హాజరుకానున్న 6 రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులు
నేడు క్రూయిజ్‌పై పోర్టులో సమీక్ష సమావేశం
సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రంగంలో చేపట్టబోయే సమీకృత ప్రాజెక్టులు, సర్క్యూట్ టూరిజంపై చర్చించేందుకు ఈ నెల 9న విశాఖ వేదికగా దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతీయ టూరిజం మీట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలతో పాటు లక్షదీ్వప్, పాండిచ్ఛేరి కేంద్రపాలిత ప్రాంతాలకు పర్యాటకశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పర్యాటకాభివృద్ధికి ఆయా రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యలేమైనా ఉంటే పరిష్కరించేందుకు వేదికగా నిలవనుంది. ఇందులో భాగంగానే.. విశాఖ పోర్టులో ఇటీవల ప్రారంభమైన క్రూయిజ్ టెరి్మనల్ సేవలు విస్తృతం చేసేందుకు పోర్టు, పర్యాటక శాఖ అధికారులు, స్టేక్‌హోల్డర్‌లతో సోమవారం సమావేశం కానున్నారు. కార్డిలియా క్రూయిజ్ షిప్ నడిపేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో పాండిచ్ఛేరి ప్రభుత్వంతో ఉన్న సమస్యని పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment