గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: పౌర్ణమి తె.3.59 వరకు (తెల్లవారితే మంగళవారం) తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.11.02 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.59 నుండి 12.31 వరకు, దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.48 నుండి 3.36 వరకు, అమృతఘడియలు: ఉ.8.25నుండి 10.02 వరకు, భోగి పండగ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.39.
మేషం...కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. అంచనాలు నిజమవుతాయి. అనుకోని ఆహ్వానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృషభం...రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొంత అసంతృప్తి. ఉద్యోగాలలో పనిభారం.
మిథునం...ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటì మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
కర్కాటకం...ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
సింహం.....చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి
కన్య...కొత్త పనులు చేపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల..దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ముఖ్యమైన పనులలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
వృశ్చికం......పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు...కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. వస్తులాభాలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మకరం..చిరకాల మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.
కుంభం..ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.
మీనం....వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. శ్రమాధిక్యం.
Comments
Please login to add a commentAdd a comment