ఈ రాశి వారికి మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ధనప్రాప్తి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. | Daily Horoscope On 25th December 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ధనప్రాప్తి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు.

Published Wed, Dec 25 2024 5:38 AM | Last Updated on Wed, Dec 25 2024 7:52 AM

Daily Horoscope On 25th December 2024 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.దశమి రా.9.33 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: చిత్త ప.3.14 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: రా.9.26 నుండి 11.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.41 నుండి 12.29 వరకు, అమృతఘడియలు: ఉ.8.00 నుండి 9.47 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.31, సూర్యాస్తమయం: 5.28. 

మేషం..కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురు ఉండదు.

వృషభం...మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ధనప్రాప్తి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం....సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం... బడికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు.

సింహం....సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

కన్య...పనులలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ ఎదురుకావచ్చు.

తుల....నూతన వ్యక్తులు పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం....కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు.....పనులు చకచకా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత. విందువినోదాలు. శుభకార్యాలపై చర్చలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం...చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం.....అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు.అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పకపోవచ్చు.

మీనం..మిత్రులు,బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement