ఈ రాశివారికి పాత బాకీలు వసూలవుతాయి.. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం | Today Telugu Horoscope On September 28th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి పాత బాకీలు వసూలవుతాయి.. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం

Published Sat, Sep 28 2024 6:35 AM | Last Updated on Sat, Sep 28 2024 8:37 AM

Horoscope Today Astrology Rasi Phalalu Sep 28 In Telugu

గ్రహఫలం.. శనివారం, 28.09.24

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, 
సూర్యోదయం: 5.53, 
సూర్యాస్తమయం: 5.51.

తిథి: బ.ఏకాదశి సా.4.28 వరకు, తదుపరి ద్వాదశి, 
నక్షత్రం: ఆశ్లేష పూర్తి (24 గంటలు),

వర్జ్యం: సా.6.11 నుండి 7.51 వరకు, 
దుర్ముహూర్తం: ఉ.5.43 నుండి 7.29 వరకు, 
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, 
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు,

అమృతఘడియలు: తె.4.14 నుండి 5.54 వరకు (తెల్లవారితే ఆదివారం);

 

మేషం: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కార్యజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కొన్ని సమస్యలు తప్పవు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగానే ఉంటాయి.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

సింహం: కొన్ని పనులలో అవాంతరాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

కన్య: పాత బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజసేవలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుంది.

తుల: మిత్రులతో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఒక ప్రకటన ఆకట్టుకుటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: వ్యవహారాలలో అవరోధాలు. సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కార్యక్రమాలలో విజయం. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కుంభం: కష్టం ఫలిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. మిత్రులతో సఖ్యత.వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. బంధు,మిత్రులతో అకారణ వైరం. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement