వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించింది.
‘ఇబ్బందికర కాల్స్ నివారణపై వినియోగదారుల వ్యవహారాల శాఖ పని చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా విభిన్న భాగస్వాములతో నిమగ్నమవ్వాల్సి వచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కూడా నిబంధనలతో ముందుకు వస్తోంది. టెలికం నియంత్రణ సంస్థకు పూర్తి అధికారాలను ఇవ్వాలనుకుంటున్నాము. కాబట్టి మేము నెమ్మదించాం.
కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు టెలికం పరిశ్రమ కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతోంది’ అని నిధి ఖరే వివరించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment