పసిడి వెనకడుగు
న్యూఢిల్లీ: అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా గరిష్ట ధరల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో బంగారం పరుగు కొంత తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర సోమవారం రూ.1,300 తగ్గి రికార్డు స్థాయిల నుంచి రూ.81,100కు దిగివచ్చింది. గత ట్రేడింగ్‌లో రూ.82,400 ఆల్‌టైమ్ రికార్డుకు పసిడి దూసుకుపోయిన సంగతి తెలిసిందే.
ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.4,600 తగ్గి రూ.94,900కి చేరింది.ఆభరణ వర్తకులు, రిటైలర్ల నుంచి కూడా డిమాండ్ కొంత మందగించినట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. కాగా, 99.5 స్వచ్ఛత పసిడి ధర న్యూఢిల్లీలో రూ.1,300 దిగివచి్చన రూ.80,700కు చేరింది. ఇదిలావుండగా అంతర్జాతీయ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రా ములు) ధర 2,747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ పసిడి ధర వారంరోజుల క్రితం 2,802 డాల ర్ల ఆల్‌టైమ్ రికార్డును తాకిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment