
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు 2020 అక్టోబర్ నెలలో 14 రోజులు పనిచేయవు. ఈ సెలవుల్లో రెండు, నాలుగు శనివారాలు ఆదివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకం ప్రకారం, అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకుల సెలవు. ఆర్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, అక్టోబర్ సెలవుల జాబితాలో గాంధీ జయంతి, మహాసప్తమి, దసరా పండుగ, మిలాద్ ఉన్ నబీ ఉన్నాయి. ఇక అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలలో ఆదివారాలు. అలాగే అక్టోబర్ 10, 24 తేదీలు రెండో, నాలుగో శనివారాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో శని, ఆదివారాల్లో నవమి, దసరా (అక్టోబరు 25) పండుగ లొచ్చాయి.
అక్టోబర్ 2020 : ప్రధాన సెలవులు
అక్టోబర్ 2 (శుక్రవారం) - మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు)
అక్టోబర్ 8 (గురువారం) - చెల్లం (ప్రాంతీయ)
అక్టోబర్ 23 (శుక్రవారం) - మహాసప్తమి (చాలా రాష్ట్రాలు)
అక్టోబర్ 26 (సోమవారం) - విజయ దశమి (చాలా రాష్ట్రాలు)
అక్టోబర్ 29 (గురువారం) - మిలాద్ ఉన్ నబీ (ప్రాంతీయ)
అక్టోబర్ 31 (శనివారం) - మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి (ప్రాంతీయ)