ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, కోవిడ్-19 అనంతర భారతీయ స్టాక్ మార్కెట్లు తిరిగి మళ్లీ పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ స్టాక్ భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. 2021-22లో సుమారు 190 మల్టీ బ్యాగర్ స్టాక్స్‌గా అవతారమెత్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్ వచ్చేలా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి మల్టీ బ్యాగర్ స్టాక్స్.
మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో రాధికా జ్యువెల్‌టెక్ కూడా ఒకటి. గత ఏడాది రాధికా జ్యువెల్ ఒక్కో షేరు ధర రూ. 15.30 నుంచి రూ. 178.10కి పెరిగింది.దాదాపు 1050 శాతం మేర పెరిగింది. గడిచిన నెలలో...ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ. 154 నుంచి రూ. 178కి పెరగడం గమనర్హం. ఈ స్టాక్ 2022లో దాదాపు 35 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత 6 నెలల్లో....మల్టీబ్యాగర్ జ్యువెలరీ స్టాక్ ఒక్కో షేరు దాదాపు రూ. 86 నుంచి రూ. 178 వరకు పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ ధర రూ. 178. 10 వద్ద ఉంది.
లక్ష ఇన్వెస్ట్ చేస్తే...రూ. 11 లక్షల రాబడి..!
రాధికా జ్యువెల్‌టెక్ షేర్ ధర చూస్తే...ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ రోజు రూ. 1.15 లక్షలకు మారేది . 2021 సంవత్సరం చివరి నాటికి ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని రూ. 1 లక్ష ఈ రోజు రూ. 1.35 లక్షలుగా ఉండేది. అలాగే 6 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ రోజు రూ. 2.10 లక్షలకు మారేది. అదేవిధంగా ఒక పెట్టుబడిదారుడు ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో ఒక సంవత్సరం క్రితం ఒక్కో స్టాక్‌ను రూ. 15.30 చొప్పున రూ. ఒక లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 11.50 లక్షలకు మారేది.
చదవండి: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు!
Comments
Please login to add a commentAdd a comment