
ముంబై: సాధారణ బీమా సంస్థ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్‌జీఐసీఎల్) తాజాగా కార్ల కోసం ’రిలయన్స్ లిమిట్ ష్యూర్ – పే యాజ్ యూ డ్రైవ్’ పేరిట కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. వాహనం తిరిగే దూరానికి అనుగుణంగా ఈ పాలసీని తీసుకోవచ్చని సంస్థ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు.
కనిష్టంగా 2,500 కిలోమీటర్ల శ్లాబ్‌తో మొదలుపెట్టి అవసరాన్ని బట్టి అదనంగా 1,000 కిలోమీటర్ల మేర పరిమితిని పెంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే తాము ఎంచుకున్న శ్లాబ్‌లో కిలోమీటర్లు మిగిలిపోతే, పాలసీని రెన్యువల్ చేసుకునేటప్పుడు వాటిపై డిస్కౌంటు కూడా పొందవచ్చని వివరించారు.
ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!
అటు తమ ప్లాన్‌లో కిలోమీటర్ల పరిమితిని దాటిపోయినప్పటికీ అగ్నిప్రమాదం, దొంగతనానికి సంబంధించి థర్డ్ పార్టీ కవరేజీని పొందవచ్చని తెలిపారు. 'రిలయన్స్ లిమిట్ ష్యూర్ - పే యాజ్ యు డ్రైవ్' అనేది పూర్తి థర్డ్-పార్టీ, ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌తో సహా కన్వెన్షనల్ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సమానమైన అన్నింటిని కవర్ చేసే కవరేజీని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment