దానిమ్మ గుండెజబ్బులను నివారిస్తుందన్నది చాలామందికి తెలిసిందే. అయితే అది బరువు పెరగకుండా చూడటం వల్ల ఒబేసిటీ కారణంగా వచ్చే అనేక ఆరోగ్య అనర్థాలను కూడా నివారిస్తుంది. దానిమ్మతో బరువు తగ్గడానికి కారణమూ ఉంది. అదేమిటంటే... ఇందులో 7 గ్రాముల పీచు ఉండటం వల్ల అది కడుపు (స్టమక్) ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుతుంది.
అంతేకాదు దానిమ్మపండులో 3 గ్రాముల ప్రోటీన్, విటమిన్ సీ, విటమిన్ కె అనే ప్రధాన విటమిన్లతోపాటు పొటాషియమ్ వంటి హైబీపీని నియంత్రించేందుకు సహాయపడే లవణాలూ ఉన్నాయి. తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉన్నందున బరువు తగ్గించడానికి దానిమ్మపండు బాగా ఉపయోగపడుతుంది.
(చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్‌నెస్ మంత్ర..!)
Comments
Please login to add a commentAdd a comment