Remove Blocks In Heart With Ayurvedic Medicine, Check How To Made This At Home - Sakshi
Sakshi News home page

నిత్యం వంటింట్లో ఉపయోగించే వాటితో..గుండెలో బ్లాక్స్‌కి చెక్‌పెట్టండి ఇలా..

Published Tue, Jun 13 2023 1:38 PM | Last Updated on Tue, Jun 13 2023 3:25 PM

Remove Blocks In Heart With Ayurvedic Medicine - Sakshi

చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారినపడుతున్నారు. సినీ స్టార్‌ల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ చిన్న వయస్సులోనే గుండెజబ్బుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మారుతున్న జీవనశైలికి తోడు ఉరుకుల పరుకుల జీవనం కారణంగా.. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినంత వ్యాయమం లేకపోవడం తదితర కారణాల రీత్యా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వీటికి ప్రధాన కారణం ఓబెసిటీ, స్మోకింగ్‌. సాధ్యమైనంత వరకు స్మోకింగ్‌ కు దూరంగా ఉండటమే మంచిది. గుండెకు సరఫరా అయ్యే నాళాల్లో బ్లాక్‌లు ఏర్పడి గుండె కండరం డ్యామేజ్‌ అయ్యితే దాన్ని హార్ట్‌ అటాక్‌ అంటారు.

అలాగే నడుస్తుంటే ఆయాసం వచ్చిన గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని గుర్తించి సకాలంలో వైద్యుల వద్ద చికిత్స తీసుకోవాలి. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో బ్లాక్‌లు ఉన్నట్లు తేలితే.. ప్రమాద తీవ్రతను బట్టి వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవడం మంచిది. ఐతే ఈ బ్లాక్‌లను చక్కటి ఆయర్వేద వైద్యంతో కూడా సులభంగా తొలగించుకోవచ్చని చెబుతున్నారు నవీన్‌ నడిమింటి. మనం వంటింట్లో తరుచుగా ఉపయోగించే వాటితోనే ఈ బ్లాక్‌లకు చెక్‌పెట్టొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణుల నవీన్‌ నడిమింటి. అవేమిటో ఆయన మాటల్లోనే చూద్దామా..

అల్లం 
ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90 శాతం తగ్గించగలదు.

వెల్లుల్లి రసం
ఇందులో ఉండే అల్లిసిన్‌ మూలకం కొలస్ట్రాల్‌ని, బీపీని తగ్గిస్తుంది. దీంతో హార్ట్‌ బ్లాక్‌ ఓపెన్‌ అవుతుంది

నిమ్మరసం
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సీ, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌
ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో అన్ని నరాలను తెరుస్తాయి. అలసటను తగ్గిస్తుంది. 

పై వాటన్నింటితో తయారు చేసే ఔషధం రోజు ఉదయం పరగడుపున మూడు స్పూన్లు తీసుకుంటే అన్ని బ్లాక్స్‌ సులభంగా తొలగిపోతాయి.

తయారు చేయు విధానం:
నిమ్మరసం - ఒక కప్పు
అల్లం రసం- ఒక కప్పు
వెల్లులి రసం- ఒక కప్పు
ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌- ఒక కప్పు

విధానం:
ఆ నాలుగింటిని కలిపి సన్నని మంటపై వేడి చేయండి. మూడు కప్పులు అయ్యేంత వరకు బాగా మరిగించండి. ఆ తర్వాత చల్లారిన ఆ మిశ్రమానికి మూడు కప్పుల తేనె కలిపి ఓ సీసాలో భద్రపరుచుకోండి. దీంతో బ్లాక్‌లు సులభంగా తొలుగుతాయని, ఈ సమస్య నుంచి త్వరిత గతిన బయటపడే అవకాశం ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణలు నవీన్‌ నడిమింటి చెబుతున్నారు. 

(చదవండి: బరువు తగ్గాలనుకుంటే..బ్రేక్‌ ఫాస్ట్‌లో వాటిని దగ్గరకు రానియ్యకండి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement