వార ఫలాలు (ఆగస్టు 23 నుంచి 29 వరకు) | Weekly Horoscope From August 23th To 29th | Sakshi
Sakshi News home page

వార ఫలాలు (ఆగస్టు 23 నుంచి 29 వరకు)

Published Sun, Aug 23 2020 9:26 AM | Last Updated on Sun, Aug 23 2020 9:41 AM

Weekly Horoscope From August 23th To 29th - Sakshi

మేషం: ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో  సోదరుల సహకారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో  భాగస్వాములతో తగాదాలు తీరతాయి. ఉద్యోగాలలో  కోరుకున్న మార్పులు పొందుతారు. కళారంగం వారి యత్నాలు కొంత అనుకూలిస్తాయి. వారం వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గోధుమరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. కొన్ని  సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో  కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువర్గంతో విభేదాలు పరిష్కారమవుతాయి. కొన్ని సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి. గృహ నిర్మాణయత్నాలపై కుటుంబంలో చర్చలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  కాంట్రాక్టర్లకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములలో ఒప్పందాలు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు మరిన్ని ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిళ్లు. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: అనుకున్న రాబడి సమకూరి అవసరాలు తీరతాయి.  ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సమాజంలో పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు కొంత సంతోషం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో   అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం. తెలుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

సింహం: ఆర్థిక విషయాలు అంతగా అనకూలించక రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సోదరులు, మిత్రులతో  అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు.  ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు. పారిశ్రామికవర్గాలకు ఒప్పందాలలో మార్పులు.  వారం  మధ్యలో  శుభవార్తలు. వాహనయోగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. 

కన్య: అనుకున్న పనులు కష్టసాధ్యమైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల నుంచి  బయటపడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది.  ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు, భాగస్వాములతో నూతన ఒప్పందాలు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి అవకాశాలు ఎట్టకేలకు దక్కుతాయి. వారం  చివరిలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

తుల: ప్రారంభంలో  వివాదాలు నెలకొన్నా చాకచక్యంగా సర్దుబాటు చేసుకుంటారు. అనుకున్న రాబడి సమకూరుతుంది.  జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. తండ్రి తరఫు నుంచి ఆస్తిలాభం ఉండవచ్చు. వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. అనారోగ్య సూచనలు. నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: మీ అనుభవాలతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు.ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆస్తి  విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగుపడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.. వాహనయోగం. ఊహించని విధంగా  ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు  మరింతగా లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి అంచనాలు నిజమయ్యే సమయం. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. మీ ప్రతిపాదనలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.  పలుకుబడి మరింత పెరుగుతుంది. సన్నిహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. వ్యాపారాలలో అనుకోని  పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గి ఊపిరిపీల్చుకుంటారు.  పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది.

మకరం: ప్రారంభంలో ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. సోదరులు సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.  స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ తీసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు క్రమేపీ తొలగుతాయి. రాజకీయవర్గాలకు విశేష గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. 

కుంభం: అనుకున్న పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి కొంత బయటపడతారు. విద్యార్ధులకు ఫలితాలు కాస్త ఊరటనిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకువస్తాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. విదేశాలలోని బంధువుల క్షేమసమాచారాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అంది విస్తరణ కార్యక్రమాలలో పాల్గొంటారు.   ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు దక్కవచ్చు.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: కొత్త వ్యక్తులు పరిచయం. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. సోదరులు, స్నేహితులతో వివాదాలు  పరిష్కారం. ఇంటి నిర్మాణప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు.  చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కరించుకుంటారు.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, గోధుమ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.


 
 

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement