ధరల వాత | - | Sakshi
Sakshi News home page

ధరల వాత

Published Mon, Jun 24 2024 1:44 AM | Last Updated on Mon, Jun 24 2024 1:44 AM

ధరల వాత

ధరల వాత

కూరగాయల ధరలు ఇలా..

కూరగాయలు మే నెలలో జూన్‌లో

చిల్లర (కిలో)

ధరలు(కిలో)

టమాటా 30 80-120

పచ్చి మిర్చి 40 60

దేశీ చిక్కుడు 60 60

గోరు చిక్కుడు 45 60

క్యాబేజీ 30 40

బెండకాయ 30 40

కాకరకాయ 40 60

ప్లవర్‌ 45 55

వంకాయ 30 40

బిన్నీస్‌ 80 130

క్యారెట్‌ 40 60

కీరదోస 20 40

బీట్‌రూట్‌ 20 40

ఆలుగడ్డ 30 45

చామగడ్డ 45 60

బీరకాయ 40 70

దోసకాయ 20 30

దొండకాయ 30 40

క్యాప్సికం 40 60

వరంగల్‌: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూ.300 వెచ్చించినా వారానికి సరిపడా కూరగాయలు రావట్లేదు. ముఖ్యంగా.. టమాటా, పచ్చిమిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఇతర కూరగాయల ధరలు సైతం మోతమోగుతున్నాయి. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కేజీ కొనే స్థానంలో.. అరకేజీ కొంటున్నారు. అరకేజీ కొనేవారు పావు కేజీకే పరిమితమవుతున్నారు. కాగా.. ఏ కూరగాయలు కొన్నా.. తప్పనిసిరిగా టమాటా, మిర్చి ఉండాల్సిందే.. వీటి ధరల్ని చూసి కొనేందుకు ప్రజలు జంకుతున్నారు. లక్ష్మీపురం మార్కెట్‌కు నిత్యం సుమారు. 600–400 టన్నుల కూరగాయలు వచ్చేవి. ధరలు పెరిగిన కారణంగా.. కేవలం 100–150 టన్నులు మాత్రమే వస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

ట‘మోత’..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మదనపల్లి మార్కెట్‌ టమాటాకు పెట్టింది పేరు. లక్ష్మీపురం మార్కెట్‌కు సాధారణ రోజుల్లో నిత్యం 15–20 డీసీఎంల టమాటా అంటే 6 వేల బాక్స్‌(25కిలోలు)లను హోల్‌సేల్‌ వ్యాపారులు తెప్పిస్తారు. అప్పుడు బాక్స్‌ రూ.300 నుంచి రూ.600ల వరకు విక్రయిస్తారు. అంటే కిలో రూ.10 నుంచి రూ.25వరకు విక్రయిస్తారు. టమాటాకు ఫుల్‌ డిమాండ్‌ ఉండడం.. లోకల్‌లో పంటలు లేక పోవడం వల్ల టమాట బాక్స్‌ ధరలు మదనపల్లిలోనే అమాంతం పెరిగాయి. దీంతో ప్రస్తుతం టమాటా బాక్స్‌ రూ.1500–రూ.1700లకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్‌గా కిలో టమాట ధర రూ.68 లు చిల్లర వ్యాపారులకు పడుతోంది. వారు లాభం చూసుకుని కొనుగోలుదారుడికి కిలో రూ.80–రూ.90లకు తక్కువగా అమ్మడం లేదు. నాణ్యత లేని టమాటాల్ని తక్కువ ధరకు అమ్ముతున్నా.. వాటిని కొనేందుకు ప్రజలు వెనుకాడుతున్నారు.

మిర్చి మంట..

కాగా లోకల్‌లో మిర్చి పంటలు లేకపోవడంతో వ్యాపారులు కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌, కడప నుంచి తీసుకొస్తున్నారు. మిర్చి క్వింటాకు రూ.2800– రూ.3,200లకు హోల్‌సేల్‌గా విక్రయించడంతో రిటైల్‌ వ్యాపారులు కిలో రూ.40–50లకు విక్రయిస్తున్నారు. సైజు, క్వాలిటీని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. రోజూ 15 టన్నులు వచ్చే మిర్చి ప్రస్తుతం 10 టన్నులు మాత్రమే వస్తోంది. టమాటా ధరలు తక్కువున్న సమయంలో మిర్చి ఎక్కువగా అమ్మేదని వ్యాపారులు తెలిపారు.

ఆకుకూరలు అమాంతం..

కూరగాయల ధరలు పెరగడంతో ఎక్కువ మంది ఆకు కూరలను కొంటున్నారు. స్థానికంగా వీటి సాగు కూడా తక్కువ ఉండడంతో వీటి ధరలు సైతం పెరిగాయి. ఇదివరకు కిలోకు రూ.20–30లకు దొరికే పాలకూర, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చలకూర, మెంతికూర, బచ్చలికూర, గంగవాయిలి కూరలు రూ.50–60లకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. కొత్తిమీర, పుదీనా ను కర్ణాటక బెంగళూరు నుంచి దిగుమతి చేసుకునేవారు. కిలో కొత్తిమీర రూ.60–రూ.80లకు, పుదీనా రూ.100లకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

చుక్కలు చూపిస్తున్న కూరగాయలు

స్థానికంగా దిగుబడి లేక

ధరలకు రెక్కలు

మార్కెట్ల వారీగా రేట్ల వ్యత్యాసం

కొనలేని స్థితిలో సామాన్యులు

మార్కెట్‌ల వారీగా ధరలు..

కూరగాయల ధరలు పెరగడంతో నగరంలోని మార్కెట్‌ల వారీగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. వరంగల్‌ మార్కెట్‌లో కిలో టమాట రూ.60లకు దొరికితే హనుమకొండలో రూ.80లకు లభిస్తోంది. మిర్చి లక్ష్మీపురంలో రూ.30–40లకు కిలో విక్రయిస్తుండగా.. హనుమకొండలో రూ.50–60లకు పైగా విక్రయిస్తున్నారు. ప్రతీ కూరగాయ రకాలకు వరంగల్‌ లక్ష్మీపురం మార్కెట్‌కు హనుమకొండ కుమారపల్లి, బాలసముద్రం, ఎక్సైజ్‌ కాలనీ రైతు బజార్లలో కిలోకు రూ.20లకు పైగా అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement