448 టీచర్‌ పోస్టులు ఖాళీ | - | Sakshi
Sakshi News home page

448 టీచర్‌ పోస్టులు ఖాళీ

Published Mon, Jun 24 2024 1:46 AM | Last Updated on Mon, Jun 24 2024 1:46 AM

448 టీచర్‌ పోస్టులు ఖాళీ

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, లోకల్‌బాడీ యాజమాన్యాల పరిధిలో ఎస్జీటీ తత్సమాన ఉపాధ్యాయుల వేకన్సీలు 448 ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అందులో క్లియర్‌ వేకెన్సీలు 303 ఉండగా ఒకేచోట 8 ఏళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న ఉపాధ్యాయుల ఖాళీలు 145 ఉన్నాయి. బదిలీల ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీనియార్టీ జాబితాలు వెల్లడించిన అనంతరం వెబ్‌ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. బదిలీల ప్రక్రియ కోసం ఉపాధ్యాయులు నిరీక్షిస్తున్నారు. అయితే.. ప్రభుత్వ, లోకల్‌బాడీ యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో ఎస్జీటీలు, తత్సమాన ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల ప్రక్రియ ఇటీవల పూర్తయింది. 455 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందగా 418 మంది జాయిన్‌ అయ్యారు. 37 మంది నాట్‌విల్లింగ్‌ ఇవ్వగా అందులో 26 మంది బహుళ ఎస్‌ఏ పోస్టుల్లో పదోన్నతి పొంది ఒక్కపోస్టులో చేరారు. సింగిల్‌ పోస్టులో పదోన్నతి పొందినవారిలో 11 మంది నాట్‌విలింగ్‌ ఇచ్చారు. ఇక ఎస్జీటీ తత్సమాన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరగాల్సి ఉంది.

క్లియర్‌ వేకెన్సీలు 303,

ఎనిమిదేళ్ల సర్వీసువి 145

బదిలీల ప్రక్రియ కోసం జాబితా వెల్లడి

ప్రభుత్వ యాజమాన్య/లోకల్‌ బాడీ పరిధి వేకెన్సీల వివరాలు

యాజమాన్య/లోకల్‌ బాడీ

హోదా క్లియర్‌ ఎనిమిదేళ్లు

ఎస్జీటీ టీఎం 35/198 26/111

ఎస్జీటీ యూఎం 12/01 02/05

ఎల్‌పీ హిందీ 0/11 0/0

ఎల్‌పీ తెలుగు 0/05 0/0

పీఈటీ 01/10 0/0

క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ 07/10 0/0

డ్రాయింగ్‌ మాస్టర్‌ 02/07 0/0

మ్యూజిక్‌ టీచర్‌ 0 1

ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ 04 0

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement