భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి

Jun 24 2024 1:46 AM | Updated on Jun 24 2024 1:46 AM

భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి

భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి

వరంగల్‌: బ్యాక్‌లాగ్‌ కారణంగా పదోన్నతులు రాని భాషా పండితులకు భవిష్యత్‌లో నియామకాలు లేనందున బ్యాక్‌లాగ్‌ పోస్టులను సాధారణ పోస్టులుగా మార్చి పదోన్నతులు కల్పించాలని తెలంగా ణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌(1927) ఉపాధ్యాయులు కోరారు. వారు సీఎం రేవంత్‌రెడ్డిని ఆదివారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న 8,630 మంది భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలి పారు. ఈసందర్భంగా పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. అనతరం నాయకులు మాట్లాడుతూ.. అప్‌గ్రేడ్‌ కాకుండా మిగిలిపోయిన 1,000 మంది భాషా పండిత పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌(భాష)లుగా అప్‌గ్రేడ్‌ చేసి పండిత వ్యవస్థను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు, బదిలీలకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్‌ దేవసేన, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, కోశాధికారి వీఎస్‌ఎస్‌సీ.శర్మ, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు హమీద్‌ఖాన్‌ బృందం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement