సివిల్స్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Jun 25 2024 1:14 AM | Updated on Jun 25 2024 1:14 AM

కాళోజీ సెంటర్‌: సివిల్స్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి సి.భాగ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉచిత శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా వంద మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఏదైనా డిగ్రీ /ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, దివ్యాంగులు జూలై 10లోగా htttp://tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు జూలై 21న హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ కేంద్రాల్లో ఎంపిక పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040–23546552, 81216 26423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement