లక్డీకాపూల్: మూత్రాశయానికి పడిన అతిపెద్ద రంధ్రాన్ని రోబోటిక్ టెక్నాలజీ సాయంతో మూసేసి..ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు ఊరట కలిగించారు. వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లాకు చెందిన మహిళ(56) 35 ఏళ్లుగా మూత్రాశయ సమస్యతో బాధపడుతోంది. మూత్రాశయానికి ఆరు సెంటీమీటర్ల రంధ్రం ఏర్పడిన కారణంగా ఆమెకు మూత్రం నిలిచేది కాదు. ఇటీవల ఆమె భర్తకు మూత్రపిండాల్లో రాళ్లు తీయించడానికి ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలను చూసి, తన సమస్య కూడా చెప్పి, దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని ఆమె అడిగారు. అప్పుడు తగిన వైద్య పరీక్షలు చేసి అనంతర చికిత్స అందించారు. 35 ఏళ్లుగా అంత పెద్ద రంధ్రంతో బాధపడుతున్న రోగికి చికిత్స చేసేందుకు ఇలాంటి రోబోటిక్ శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. డాక్టర్ సారికా పాండ్యాతో కలిసి ఈ శస్త్ర చికిత్స చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment