ఇజ్రాయెల్- హమాస్ మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ, మానవతా సాయం కోసం ఒప్పందంపై చర్చల ప్రయత్నాలు జరుతున్న సమయంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దులో హమాస్ బలగాలు రాకెట్ల దాడితో తెగపడ్డాయి. హమాస్ బలగాలు చేసిన రాకెట్ల దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా, పలువురు గాయడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. రఫా నుంచి దాదాపు పది రాకెట్లు కెరెమ్ షాలోమ్ సరిహద్దు ప్రయోగించబడ్డాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
మరోవైపు హమాస్ రాకెట్ దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం చేసిన దాడిలో 19 మంది మృతి చెందినట్లు పాలస్తీనా అధికారులు పేర్కొన్నారు. హమాస్ రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దును మూసివేసినట్లు ప్రకటించింది. గాజాకు మానవతా సాయం, ఆహారం, వైద్య సామాగ్రి అందించడానికి వినియోగించే పలు సరిహద్దుల్లో కెరెమ్ షాలోమ్ ఒకటి.
ఇక..కాల్పుల విరమణ, మానవతా సాయానికి సంబంధించి ఆదివారం హమాస్ మిలిటెంట్ల డిమాండ్‌ను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఖతర్, ఈజిప్ట్, అమెరికా దేశాలు కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం గాజాలోని కీలకమైన రఫా నగరంపై తమ దాడి కొనసాగిస్తామని తేల్చిచెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment