కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో చిలక జోస్యం చెప్పు
● మాజీ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర అని గొప్పలు చెప్పుకునే బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చిన్న అమ్మాయి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినా సిగ్గు రాలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయన చిల కజోస్యం చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందంటూ ఎర్రబెల్లి చెప్పిన మాటలు చిలుక జో స్యం లాగానే ఉన్నాయని, ఆయనకు నిజంగా జ్యోతిషం తెలిస్తే ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేస్తాడో, ఫార్ములా ఈ–రేసులో కేటీఆర్ ఎప్పుడు అరెస్టు అవుతాడో చెప్పాలని శ్రీనివాస్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఆలోచించాల్సిన అవసరం ఎర్రబెల్లికి లేదని, ఇప్పటికే ఆ పార్టీ నుంచి 10 మంది వెళ్లిపోగా మిగిలిన వారిని కాపాడుకోవాలని సూచించారు. సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా 18, 19 తేదీల్లో నిరసన
● 9 వామపక్ష పార్టీల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రజల మౌలిక అవసరాలకు కేటాయింపులు తగ్గించి, సంపన్నులకు రాయితీలు పెంచడం ద్వారా సామాన్యులకు తీరని ద్రోహం చేసిందని తొమ్మిది వామపక్ష పార్టీలు విమర్శించాయి. ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ అఖిలభారత వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈ నెల 18, 19 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వామపక్ష పార్టీల నేతలు జాన్ వెస్లీ (సీపీఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), పోటు రంగారావు (సీపీఎం–ఎంఎల్) మాస్‌లైన్, గాదగోని రవి (ఎంసీపీఐ–యూ), సాదినేని వెంకటేశ్వర్‌రావు (సీపీఐ–ఎంఎల్ న్యూ డెమోక్రసీ), జానకిరాములు (రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ), సీహెచ్ మురహరి (ఎస్‌యూసీఐ–సీ), రమేశ్ రాజా (సీపీఐ–ఎంఎల్ లిబరేషన్), బి.సురేందర్ రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్) శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు హామీ కల్పించి, బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని ఉపసంహరించాలనే పలు డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజ లు స్వచ్ఛందంగా పాల్గొన్నాలన్నారు.
క్లుప్తంగా...
Comments
Please login to add a commentAdd a comment