
స్థానికంగానే పరిష్కరించాలి
తుమకూరు: ప్రజా సమస్యలను గ్రామ స్థాయిలోనే గ్రామ లెక్కాధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పరిష్కరించాలని జిల్లాధికారి శుభకల్యాణ్ సూచించారు. జిల్లా పాలన యంత్రాంగం ఆధ్వర్యంలో తురువెకెరె పట్టణం శ్రీ సత్యగణపతి ఆస్థాన మంటపంలో బుధవారం ఏర్పాటు చేసిన తాలూకా స్థాయి జనస్పందన కార్యక్రమంలో జిల్లాధికారి పాల్గొని మాట్లాడారు. ఫిర్యాదులు అర్హమైనవా కాదా అని పరిశీలించి 15రోజుల్లోగానే పరిష్కరించాలని సూచించారు. స్థానికంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment