కిరాతక కొడుకు
కృష్ణరాజపురం: బెంగళూరులో కన్న తండ్రిని తనయుడు హతమార్చిన ఘటన బ్యాడరహళ్లి బాలాజీ లేఅవుట్‌లో జరిగింది. వివరాలు.. మృతున్ని రిటైర్డ్ బీఎస్‌ఎఫ్ జవాన్ చెన్నబసవయ్య (54)గా గుర్తించారు. వివరాలు.. అతని కుమారుడు అమిత్ (26) తాగుడుకు బానిసగా మారాడు. నిత్యం పీకలదాకా తాగి వచ్చి మళ్లీ తనకు తాగుడకు డబ్బులివ్వాలని తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తుండేవాడు. తాగుడుకు డబ్బు లేకుంటే తల్లి బంగారు గాజులు, చెవి కమ్మలు ఇవ్వమని అడిగేవాడు. మంగళసూత్రాన్ని కూడా లాక్కొనేందుకు ప్రయత్నించేవాడు. ఈ విషయం తెలిసి కుమారుడిని తండ్రి తీవ్రంగా మందలించాడు. దీనిని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న అమిత్ తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యథాప్రకారం తాగి వచ్చి తండ్రితో గొడవకు దిగాడు. కోపోద్రేకంలో ఇనుప రాడ్డుతో కొట్టి చాకుతో పొడిచి తండ్రిని చంపాడు. బ్యాడరహళ్లి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి అమిత్‌ను అరెస్టు చేశారు.
వ్యసనాలకు లోనై.. తండ్రి హత్య
Comments
Please login to add a commentAdd a comment