నన్ను టార్గెట్ చేశారు: కుమార
రామనగర జిల్లా బిడది హొబళి కేతగానహళ్ళిలో తమకు చెందిన భూమిని నేను 40 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశాము. గతంలోనే అనేకసార్లు సర్వే, తనిఖీ అన్ని కూడా జరిగాయి. మళ్లీ మంగళవారం నుంచి సర్వే కార్యాన్ని చేపట్టారు. విచారణకు సిద్ధం, ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసి సర్వే చేయిస్తోంది. సీఎం సిద్దరామయ్య మాదిరిగా నేను ప్రభుత్వ భూమిని దోచుకోలేదని ధ్వజమెత్తారు. 40 సంవత్సరాలు లేని ఫిర్యాదిదారులు నేడు ఎలా ఉద్భవించారన్నారు. సర్వేకు ఇబ్బంది లేదని కలెక్టర్‌కు చెప్పాను. 1987లో మాజీ ఎమ్మెల్యే సీఎం లింగప్ప, రామచంద్రప్ప అనే వ్యక్తులు అప్పటి ముఖ్యమంత్రి, ప్రధాని, హోం మంత్రికి ఫిర్యాదు చేశారు, అన్నీ చట్ట ప్రకారం కొన్నామని తెలిపాము, అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని అన్నారు. ఐఏఎస్‌లతో సిద్దరామయ్య సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు. భూమి, జలం, భాష కోసం సిద్దరామయ్య ఏనాడూ పోరాడలేదు, డీ.కే.శివకుమార్ సేవలు రాష్ట్రానికి ఏమున్నాయి? ధనం కొల్లగొట్టడమే ఆయన సేవలు అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment