గుండెపోటుతో కార్మికుడి మృతి
● మృతదేహాన్ని లాక్కెళ్లిన కార్మికులు
● సోషల్ మీడియాలో వీడియో వైరల్
● ఆరుగురు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా సేడం తాలుకా కోడ్లా శ్రీసిమెంట్ పరిశ్రమలో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కార్మికుడు మరణించిన ఘటన జరిగింది. మృతుడిని సిమెంట్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న బిహార్ వలస కార్మికుడు చందన్ సింగ్(35)గా పోలీసులు గుర్తించారు. విధి నిర్వహణలో గుండెపోటు రావడం, రక్తపోటు(బీపీ) తగ్గడంతో ప్రాణాలు వదిలాడు. అయితే మానవత్వం మరచి మరణించిన సాటి కార్మికుడి మృతదేహాన్ని కార్మికులు లాక్కెళ్లిన ఘటన అందరినీ కలిచి వేసిన విషయంపై బుధవారం సాయంత్రం వీడియో వైరల్ అయింది. ఇందుకు సంబంధించి ఉత్తర భారతదేశానికి చెందిన హైదర్ అలీ, రవిశంకర్, హరిందర్ నిశాద్, అజయ్, రమేష్, చంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుండెపోటుతో కార్మికుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment