అగ్నిప్రమాదంలో జొన్న పంట దగ్ధం
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా కప్పగల్‌లో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు జొన్న పంటల రాశులకు నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. రాజశేఖర్ గౌడ అనే రైతు తన 14 ఎకరాల పొలంలో పండించిన జొన్న పంటను గ్రామంలోని బసవణ్ణ ఆలయం సమీపంలో కుప్పగా వేశారు. అయితే ఎవరో దుండగులు కుప్పలకు నిప్పంటించారు. సమాచారం అందగానే పోలీసులు అగ్నిమాపక దళం సిబ్బందితో వచ్చి మంటలను ఆర్పారు. ప్రమాదంలో దాదాపు రూ.14 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. తహసీల్దార్ రాజు ఫిరంగి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment