గ్యారెంటీతో విద్యుత్ శాఖకు షాక్
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో పంచ గ్యారెంటీల అమలుతో విద్యుత్ శాఖ పరిధిలోని నాలుగు ఎస్కాం సంస్థలకు షాక్ తగిలింది. ప్రభుత్వం అమలు పరిచిన శక్తి పఽథకం తరువాత విద్యుత్ శాఖ నిర్వీర్యం అవుతోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్లింది. అదే బాటలోకి ఎస్కాం సంస్థలు పయనిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ అమలుకు మొదట్లో వ్యతిరేకత చెప్పిన నిపుణుల అభిప్రాయాలను సర్కార్ తీవ్రంగా పరిగణించలేదు. బస్ చార్జీలు ఒకటిన్నర శాతం పెంచిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్కాంలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగులకు పీఎఫ్, జీపీఎఫ్, ఇంధన వ్యయం, గ్రాచ్యుటీ, వేతన బకాయిలు, ఇతరత్ర కలిపి రూ.2,850 కోట్ల మేర నష్టాల బాటలో సంస్థలున్నాయి. కర్ణాటక విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ(కేఈఆర్‌సీ) నివేదిక మేరకు మూడేళ్ల పాటు వరుసగా 2026లో 67, 2027లో 75, 2028లో 91 పైసల మేర యూనిట్ ధర పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2025లో కేఈఆర్‌సీ నివేదిక ప్రకారం మెస్కాం, బెస్కాం, హెస్కాం, జెస్కాంలలో 20 శాతం మేర విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతి కోరారు. 2025 ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపుదలను అమలు చేయాలని కేఈఆర్‌సీ ఇచ్చిన నివేదిక జారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చార్జీలు పెంచినా తగ్గని నష్టం
విద్యుత్ చార్జీల మోతకు సిద్ధం
నష్టాల ఊబిలో ఎస్కాం సంస్థలు
Comments
Please login to add a commentAdd a comment