డాక్టర్ అనన్యరావు మృతదేహం లభ్యం
సాక్షి,బళ్లారి/హొసపేటె: ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ అందాలతో పాటు చుట్టుపక్కల తుంగభద్ర నదీ తీర ప్రాంతాలను సందర్శించి రెండు రోజులు సేద తీరుదామని వచ్చిన డాక్టర్ అనన్యరావు కానరాని లోకాలకు చేరింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్య తన స్నేహితులతో కలిసి కొప్పళ జిల్లా గంగావతి తాలూకా సణాపురం వద్ద తుంగభద్ర నదిలో బుధవారం ఉదయం కొట్టుకుపోయిన సంగతి విదితమే. రెండు రోజులుగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గజ ఈతగాళ్లు 16 గంటల పాటు ముమ్మరంగా గాలించడంతో నదిలో బండరాళ్ల మధ్యలో గురువారం డాక్టర్ అనన్య మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్ అనన్య సెలవులు రావడంతో సరదాగా హంపీ పరిసరాలను, తుంగభద్ర నది సోయగాలను వీక్షించేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై మునిరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనన్య మృతదేహాన్ని అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు.
డాక్టర్ అనన్యరావు మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment