అన్ని చికిత్సల లక్ష్యం ఒక్కటే
హొసపేటె: అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధ యోగా ఇలా అన్ని వైద్య విధానాలు మానవునికి సేవ చేసి రోగాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని తాలూకా వైద్యాధికారి డాక్టర్ సి.బసవరాజు తెలిపారు. నగర శివార్లలోని నవ్యసభాభవన్‌లో ఆయుష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హొసపేటె యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం సీఎంఈ సిరీస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఆయుర్వేద చికిత్స ప్రాధాన్యతను వివరించారు. టీఎంఏఈ ఆయుర్వేద మహా విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్.మనోన్మణి మాట్లాడుతూ వైద్యులు విద్యార్థులు కావాలని, కొత్త విషయాలను నేర్చుకుని అలవర్చుకోవాలని సూచించారు. శివకుమార్ హనసి లాయర్ ఆయుర్వేద ఫార్మసీ ఔషధాలను పరిచయం చేశారు. సేథ్ బేబీ కిరణ్ లైంగిక ఆరోగ్యంలో మనస్సు పాత్ర గురించి మాట్లాడారు. పిల్లల మానసిక వికాసంపై డాక్టర్ నయన కిరణ్ ఉపన్యాసం ఇచ్చారు. డాక్టర్ విజయకుమార్ జేడీ అధ్యక్షత వహించారు. ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు డాక్టర్ బీవీ భట్, కార్యదర్శి డాక్టర్ చేతన సింధు, జిల్లా కార్యదర్శి డాక్టర్ సికందర్ బాషా, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ షబ్బీర్, డాక్టర్ శాంతలా, డాక్టర్ అశ్విని పటవారే తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment