మైసూరు: ముడా స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్య కుటుంబానికి లోకాయుక్త నివేదికలో క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని ఫిర్యాదుదారుడు స్నేహమయి కృష్ణ తప్పుపట్టారు. దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సాక్ష్యాధారాలు లేని కారణంగా బి–రిపోర్టు సమర్పించినట్లు, దీన్ని న్యాయస్థానంలో ప్రశ్నించుకోవచ్చని లోకాయుక్త తనకు తెలిపినట్లు కృష్ణ చెప్పారు. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉండగానే బి రిపోర్టు ఇచ్చేందుకు పోలీసులు ఆసక్తి చూపారన్నారు. వారికి సిగ్గు ఉండాలని, వారు ఆత్మసాక్షిని అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. తాను అనేకానేక సాక్ష్యాలను ఇచ్చినట్లు, కోర్టులో వాటిని చూపించి ప్రశ్నిస్తానని చెప్పారు. ప్రజల ఎదుట నిజాలను నిరూపిస్తానని , సీఎంకు శిక్ష పడేలా చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment