శివాజీనగర: కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు హోం మంత్రి జీ.పరమేశ్వర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పరమేశ్వర్ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులను కలుస్తూ సీఎం పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిలుపు రావడం కుతూహలం కలిగిస్తోంది. హుటాహుటిన ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లారు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, ఒక వ్యక్తికి ఒకే పదవి ప్రకారం కేపీసీసీ అధ్యక్ష పదవిని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి తొలగించాలని పరమేశ్వర్ కోరుతున్నారు. అలాగే పరమేశ్వర్ చర్యల వల్ల పార్టీ గౌరవానికి భంగం కలుగుతోందని కొందరు హైకమాండ్‌కి ఫిర్యాదులు చేశారు. వీటన్నింటి గురించి రాహుల్‌గాంధీ, వేణుగోపాల్, సుర్జేవాలా వంటి నేతలు పరమేశ్వర్‌తో చర్చిస్తారని తెలిసింది. సహకార మంత్రి కే.ఎన్.రాజణ్ణ సోమవారం కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీ.కే.శివకుమార్‌పై మండిపడి, ఎవరి నుంచి క్రమశిక్షణ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. శివకుమార్ ఏఐసీసీ పేరును దుర్వినియోగం చేసుకొన్నారని ఆరోపించారు.
ఢిల్లీకి వెళ్లిన పరమేశ్వర్
కేపీసీసీ స్థానం ఖాళీగా లేదు: జార్జ్
కేపీసీసీ అధ్యక్ష మార్పు నాకు తెలియదు, ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు కదా. ఆ పదవి ఖాళీగా లేదు అని మంత్రి కే.జే.జార్జ్ అన్నారు. అధ్యక్ష మార్పు గురించి హైకమాండ్ ఏమైనా చెప్పారా అని మీడియాను ప్రశ్నించారు. మంత్రి రాజణ్ణ ఏమేం ఫిర్యాదులు చేశారో తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment