విజయపురలో నాటు పిస్టళ్ల దందా
బనశంకరి: విజయపుర (బిజాపుర) జిల్లాలో గన్ కల్చర్ బయటపడింది. నాటు పిస్తోళ్లు పెట్టుకున్న 10 మంది ఇళ్లలో పోలీసులు దాడి చేసి 10 నాటు పిస్టల్స్, 24 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ లక్ష్మణ నింబరగి మంగళవారం వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఇటీవల విజయపురలో రమేశ్‌గేము లమాణి ఇతరులు కలిసి సతీశ్ ప్రేమసింగ్ రాథోడ్‌పై పిస్టల్ తో కాల్పులు జరిపి చాకుతో పొడిచి హత్యచేశారు. ఈకేసులో 6 మందిని అరెస్ట్ చేశామని, నిందితులను విచారించినప్పుడు నాటుపిస్టళ్ల గుట్టు బయటపడిందని తెలిపారు. దీంతో జిల్లాలో వివిధ చోట్ల గాలించి తుపాకులు, తూటాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రకాశమర్కీ, అశోకపరంపాండ్రే, సుజిత సుబాష్ రాథోడ్, సుఖదేవ్ రాథోడ్, ప్రకాశ భీమసింగ్ రాథోడ్, గణేశ్ శివరామశెట్టి, చెన్నప్పమల్లప్ప నాగనూరు, సంతోష్ కిషన్ రాథోడ్, జనార్దన వసంత పవార్ అనేవారి ఇళ్లలో గాలించి తుపాకులను సీజ్‌చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నాటు తుపాకులను తెప్పించి విక్రయిస్తున్నట్లు సమాచారం. తుపాకులను కలిగి ఉండడం గొప్పగా భావించి వీటిని చాటుమాటుగా కొంటూ ఉంటారు.
10 తుపాకులు, తూటాలు సీజ్
Comments
Please login to add a commentAdd a comment