జాతీయస్థాయి క్యాంప్‌లో సత్తుపల్లి కేడెట్
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ కేడెట్ మెచ్చు ఆదర్శ్ జాతీయస్థాయి క్యాంపులో పాల్గొన్నాడు. ఒడిశాలోని రూర్కెలా ఎన్‌ఐటీలో ఇటీవల జరిగిన నేషనల్ అడ్వాన్స్ లీడర్‌షిప్ క్యాంపునకు రాష్ట్రం తరఫున ఆయన ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా టీమ్‌వర్క్, తదితర అంశాలపై అవగాహన కల్పించి ప్రశంసాపత్రం అందుకోగా, మంగళవారం ఆదర్శ్‌ను కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విజయ్‌కుమార్, అధ్యాపకులు, ఎన్‌సీసీ కేర్ టేకర్ రవికుమార్ అభినందించారు.
ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్‌గా జిల్లా వాసి
బోనకల్: బోనకల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సూర్యదేవర ప్రసన్నకుమార్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన తండ్రి జానకీరామయ్య కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ లెక్చరర్‌గా 1982 నుండి ఆరేళ్ల పనిచేశారు. అప్పట్లో ప్రసన్నకుమార్ అదే కళాశాలలో ఇంటర్ పూర్తి చేయగా.. విద్యార్థి సంఘంలో క్రియాశీలకంగా పనిచేశారు. కాగా, జానకీరామయ్య రిటైర్డ్ అయ్యాక ఖమ్మంలో నివాసముంటున్నారు. ప్రసన్నకుమార్ గతంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా, లోక్‌సభ స్పీకర్ ఓఎస్‌డీగా, ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఆయన తెలంగాణ అసెంబ్లీ సలహాదారుడిగా నియమితులవగా, ప్రస్తుతం ఏపీ శానసమండలి సెక్రటరీ జనరల్‌గా అక్కడి ప్రభుత్వం నియమించింది.
బాధ్యతల నుంచి ఇన్‌చార్జి ఎస్‌ఐల తొలగింపు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు(ఎస్‌ఐ)గా విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరిని ఆ బాధ్యతల నుండి తొలగించారు. ఈనెల 13న ‘సాక్షి’లో ‘అనుగ్రహం ఉంటే అర్హత ఎందుకు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లపై వస్తున్న ఆరోపణలను విచారించి ఇద్దరిని జవాన్లుగా వెనక్కి పంపినట్లు తెలిసింది.
బాలలను పనిలో పెట్టుకుంటే సహించేది లేదు..
నేలకొండపల్లి: బాలలతో పనిచేయించే యజమాన్యాలపై చర్యలు తప్పవని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంగమాంబ హెచ్చరించారు. మండల కేంద్రంలో ముస్కాన్ బృందాల ఆధ్వర్యాన చేపట్టిన తనిఖీల్లో ఓ మెకానిక్ షాపులో పని చేస్తున్న మైనర్‌న గుర్తించి యాజమానిపై కేసు నమోదు చేశారు. అనంరం వెంగమాంబ మాట్లాడుతూ ప్రతీ షాపులో మైనర్లు పని చేయడం లేదని బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్సై శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, సీడబ్ల్యూసీ ప్రతినిధులు భాస్కర్, హరిప్రసాద్, విమల, సతీష్, చిన్నానాయక్ తదితరులు పాల్గొన్నారు.
యువకుడిపై పోక్సో కేసు
ఖమ్మం అర్బన్: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై ఖమ్మం అర్బన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం ఖానాపురానికి చెందిన 13ఏళ్ల బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు ఖమ్మం వాసి, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చేస్తున్న యువకుడితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు సోమవారం బాలికకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం బాలిక ఇంటికి వెళ్లాక విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా యువకుడిపై పోక్సో కేసు నమోదు చేయడంతో పాటు బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం మంగళవారం ఆస్పత్రికి తరలించినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
జాతీయస్థాయి క్యాంప్‌లో సత్తుపల్లి కేడెట్
జాతీయస్థాయి క్యాంప్‌లో సత్తుపల్లి కేడెట్


