సమాజ సేవలో ముందుండాలి | - | Sakshi
Sakshi News home page

సమాజ సేవలో ముందుండాలి

Published Mon, Mar 3 2025 12:25 AM | Last Updated on Mon, Mar 3 2025 12:21 AM

సమాజ సేవలో ముందుండాలి

సమాజ సేవలో ముందుండాలి

ఖమ్మంమయూరిసెంటర్‌ : సమాజ సేవలో కమ్మ మహాజన సంఘం సభ్యులు ముందుండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సంఘం నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం ఖమ్మంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. జాతి ఔన్నత్యాన్ని పెంపొదించేలా కమిటీ నడవడిక ఉండాలన్నారు. పెద్దలు చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గొట్టిపాటి సత్యవాణి మాట్లాడుతూ కమ్మవారు అనేక రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. సంఘన్ని రాజకీయ చట్రంలో బిగించకుండా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మువ్వా విజయబాబు, గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లు రఘు, చావా రాము, ఉపాధ్యక్షులు కర్ణాటి రమాదేవి, జాయింట్‌ సెక్రటరీ వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మల, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, కోలేటి నవీన్‌, మేదరమెట్ల స్వరూపారాణి, నల్లమల ఆనంద్‌, నంబూరి సత్యనారాయణ ప్రసాద్‌, పోతినేని భూమేశ్వర్‌, తుమ్మలపల్లి నాగేశ్వరావు, తాళ్లూరి మురళీకృష్ణ, బండి రవికుమార్‌ పాల్గొన్నారు.

కమ్మ మహాజన సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారంలో మంత్రి తుమ్మల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement