రైతు రుణమాఫీ చరిత్రాత్మకం | - | Sakshi
Sakshi News home page

రైతు రుణమాఫీ చరిత్రాత్మకం

Jun 24 2024 1:56 AM | Updated on Jun 24 2024 1:56 AM

రైతు రుణమాఫీ చరిత్రాత్మకం

రైతు రుణమాఫీ చరిత్రాత్మకం

మహబూబాబాద్‌ రూరల్‌: సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని, రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే మురళీనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఏకకాలంలో రూ.2లక్షల రైతు రుణమాఫీ నిర్ణయాన్ని రైతులు మరిచిపోరన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ చేయకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పులపాలుచేసి ఖజానా ఖాళీ చేసినట్లు ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. సన్న రకం వడ్లకు మద్దతు ధరపైన రూ.500 బోనస్‌ చెల్లిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌ రెడ్డి ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కన్నతల్లి లాంటిదని, ప్రజలు అనుకున్నట్లుగా ప్రజాపాలన అందిస్తూ పేదలు, అర్హులైన వారికి సంక్షేమ పఽథకాలు తప్పనిసరిగా అమలు చేస్తుందన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలను బిల్లులు తీసుకుని కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాలతో నష్టపోయినట్లయితే రైతులకు పరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చుక్కల ఉదయ్‌ చందర్‌, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, ఖలీల్‌, ఎడ్ల రమేష్‌, అల్లం నాగేశ్వర్‌ రావు, బెల్లంకొండ శ్రీనివాస్‌, భట్టు దేవ్‌ సింగ్‌, గొల్లపల్లి ప్రభాకర్‌, కురెల్లి సతీష్‌, గుగులోత్‌ దస్రునాయక్‌, నీరుటి సురేష్‌, వెంకన్న, ఫెరోజ్‌, ఫయాజ్‌, లక్ష్మి, పద్మబాయి, భూక్య శ్రీను ఉన్నారు.

ఎమ్మెల్యే మురళీనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement