షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Jun 25 2024 1:34 AM | Updated on Jun 25 2024 1:34 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

రూ. 10 లక్షల ఆస్తి నష్టం

మరిపెడ: షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం మరిపెడ మండలం కోట్యతండా శివారు జాలు తండాలో చోటు చేసుకుంది. బాధితుడు మాలోత్‌ గణేశ్‌ కథనం ప్రకారం.. వ్యవసాయ పనుల నిమిత్తం గణేశ్‌ తన భార్య తేలతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా వాహనం వచ్చే లోగానే ఇల్లు పూర్తిగా కాలింది. ఈ ఘటనలో రూ. 2.75 లక్షలు నగదు, రెండు తులాల బంగారం, 70 తులాల వెండి, నాలుగు బస్తాల బియ్యంతో పాటు 65 మిర్చి విత్తనాల ప్యాకెట్లు కూడా కాలిబూ డిదయ్యాయి. రెండు డబుల్‌కాట్‌ మంచాలు, కూలర్‌, ఫ్రిడ్జ్‌, దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్‌ కాలిపోయాయని మొత్తం రూ. 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు రోదిస్తూ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement