No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Jun 25 2024 1:38 AM | Last Updated on Tue, Jun 25 2024 1:38 AM

No He

సాక్షి, మహబూబాబాద్‌: వర్షాకాలం వచ్చిందంటే జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, ఇతర జ్వరాలతో ఏజెన్సీ గూడేలు, గిరిజన తండాల్లో జనం ఇబ్బందులు పడుతారు. ప్రతీ ఏటా మాదిరిగానే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు.. వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైద్యారోగ్యం, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయం చేసుకోవాల్సి ఉండగా ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీంతో ఏటా ఏదో మూలన తాగునీటి కలుషితం, అపరిశుభ్ర వాతావరణంతో ఇబ్బందులు, వైద్య సేవలు అందక ఇక్కట్లు తప్పడం లేదు. అయితే ఈ ఏడాదిలో ఇప్పటికే డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యాయి. కాగా ఉన్నతాధికారులు ముందస్తు ముప్పును పసిగట్టి నివారణకు మార్గం చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

పడకేసిన పారిశుద్ధ్యం..

పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో జిల్లాలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, మురికి కాల్వలు, జనసంచార ప్రదేశాల్లో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 260కి పైగా పంచాయతీలు తండాలు, గిరిజన ఆవాస ప్రాంతాలు ఉండడం గమనార్హం. కాగా గ్రామ పంచాయతీ పాలక మండలి పదవీ కాలం ముగియడంతో గ్రామాల్లోని పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నారు. అదేవిధంగా పంచాయ తీ కార్యదర్శులపై ఒకవైపు మిషన్‌ భగీరథ సర్వే, మరోవైపు గ్రామ పంచాయతీ విధుల నిర్వహణ భారం పెరిగింది. పలుచోట్ల పారిశుద్ధ్య పనులకో సం కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ట్యాంకర్లు, చెత్త డ బ్బాలు మూలన పడ్డాయి. అదేవిధంగా చిన్న చిన్న పంచాయతీల్లో పన్నుల వసూళ్లు కాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. వేతనాలు సకా లంలో ఇవ్వడం లేదని కార్మికులు సక్రమంగా పనికి రా వడం లేదని పలువురు క్యాదర్శులు చెబుతున్నారు. ఇన్ని కారణాలతో జిల్లాలో పారిశుద్ధ్యం పడకేసింది.

కొరవడిన సమన్వయం..

వానాకాలం ఆరంభంలో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా పంచాయతీ, వైద్యారోగ్యం, తా గునీటి సరఫరా శాఖలు సమన్వయంతో పని చే యాలి. కానీ గ్రామాల్లో ఈ మూడుశాఖల ఉద్యోగులు కలిసి ప్రణాళిక రూపొందించినవి తక్కువే. దీంతో ఇప్పటికే పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పడకేశాయి. దీంతో ప్రధాన వీధులు మురికి కూపాలుగా మారాయి.అదేవిధంగా ప్రతీ శుక్రవారం ప్రైడే.. డ్రై డేగా పాటించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులు చెప్పినా.. ఆచరణకు నోచుకోవడం లేదు. గ్రామాలకు ఉన్నతాధికారులో, ప్రజాప్రతినిధులో వస్తే తప్ప కాల్వలు తీయడం, బ్లీచింగ్‌ చల్లడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇక రోడ్లపై గుంతలు పడటం, తాగునీటి పైపులు లీకేజీ లు కావడంతో కలుషిత నీరు సరఫరా అవుతోంది.

ప్రత్యేక కార్యాచరణతో ముందుకు..

సీజనల్‌ వ్యాధుల ప్రబలకుండా.. ప్రత్యేక కా ర్యాకచరణతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి కే రెవెన్యూ,ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించుకున్నాం.మున్సిపాలిటీలు, గ్రామాల్లో సర్వేలు నిర్వహించి జ్వర పీడితులకు మందులు పంపిణీ చేస్తున్నాం.ప్రతీ శుక్రవారం ప్రైడే..డ్రై డే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం.హాస్టళ్లు,గురుకుల పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలు శు భ్రంగా ఉంచడం,డాక్టర్ల పర్యవేక్షణ పెంచాం.

– కళావతి బాయి, డీఎంహెచ్‌ఓ

వానాకాలం కావడంతో

మొదలైన విష జ్వరాలు

పారిశుద్ధ్యంపై పట్టింపు కరువు

భయంభయంగా ఏజెన్సీ పల్లెలు

డెంగీ, మలేరియా

బారిన పడుతున్న ప్రజలు

2020 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో

మలేరియా, డెంగీ కేసుల వివరాలు

సంవత్సరం మలేరియా డెంగీ

2020 22 07

2021 30 43

2022 20 125

2023 06 40

202405 13

(ఇప్పటి వరకు)

మలేరియా, డెంగీ కేసులు..

అపరిశుభ్ర వాతావరణం, తాగునీటి కలుషితంతో జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు నమోదు అయ్యాయి. 2020 నుంచి 2023 వరకు జిల్లాలో 78 మలేరియా, 215 డెంగీ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 5 మలేరియా, 13 డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. వర్షాకాలం ప్రారంభ సమయంలోనే మలేరియా, డెంగీ కేసులు నమోదు అవుతుంటే.. పూర్తిగా వర్షాలు పడితే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline
1/1

No Headline

Advertisement
 
Advertisement
 
Advertisement