అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

Published Tue, Jun 25 2024 1:38 AM | Last Updated on Tue, Jun 25 2024 1:38 AM

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

మహబూబాబాద్‌: అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌ డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీలు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు రూ.26,000 వేతనం, హెల్పర్స్‌కు రూ.21,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలన్నారు. టీచర్లకు ట్యాబ్‌లు అందించి అదనపు యాప్‌ల నిర్వహణ బాధ్యతలను రద్దు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సెంటర్ల అద్దె బిల్లులు, గ్యాస్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రావణ్‌, పద్మ, శారద, జయమ్మ, స్వప్న, గీతారాణి, రాజమ్మ, రమాదేవి, వెంకన్న, శంకర్‌, పెరుగు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement