
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదమూడో వారం ముగింపుకు వచ్చేసింది. ఇప్పుడు హౌస్‌లో ఉన్న ఏడుగురిని జంటలుగా విడదీస్తే.. అఖిల్-మోనాల్(అఖినాల్), అభిజిత్-హారిక(అభిక), అవినాష్-అరియానా(అవియానా) లేదా సోహైల్-అరియానా(సోనా) అని చెప్పుకోవచ్చు. ఈ జంటలకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ జంటల్లో ఏ ఒక్కరు బాధపడ్డా మిగతా వారి కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతాయి. అంతలా కనెక్ట్ అయిపోయారు ఒకరికొకరు. వీళ్లలో ఎంతమందిది స్ట్రాంగ్ బాండ్ అనేది తెలుసుకునేందుకు బిగ్‌బాస్ ఓ పరీక్ష పెట్టాడు. ఇప్పుడు హౌస్‌లో ఉన్నవాళ్లలో వీక్ లింక్ ఎవరో చెప్తూ ఆ బాండ్‌ను బ్రేక్ చేయమని నాగార్జున ఆదేశించారు. (చదవండి: బిగ్‌బాస్: అవినాష్ కొంప ముంచిన అతి తెలివి)
అయితే అవినాష్ తనకు అసలు ఎవరితోనూ బాండింగ్ లేదని చెప్తూనే కర్ర విరగొట్టాడు. మోనాల్ అఖిల్ పేరు చెప్పి విడగొట్టినట్లుగా చూపించారు. అనంతరం అతడు లేచి ఇప్పుడు బ్రెయిన్‌తో ఆలోచిస్తున్నానని చెప్తూ మోనాల్ పేరు చెప్పి తన దగ్గరున్న స్టిక్‌ను రెండు ముక్కలు చేశాడు. అంటే మనసులో మాత్రం ఆమెతో బాండింగ్‌ను వదులుకోనని పరోక్షంగా హింటిచ్చాడు. కానీ గేమ్ వరకు మాత్రం ఆమెతో రిలేషనే వద్దని స్పష్టం చేశాడు ఏదేమైనా వాళ్ల మధ్య లింకులు పెట్టేది, చివరికి వాటిని విడగొట్టేది బిగ్‌బాసే అని ఈ టాస్క్‌తో మరోసారి రుజువు చేశారు. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం రేపటి ఎపిసోడ్‌లో మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ కానుంది. మరి వెళ్లేముందైనా ఆమె అవినాష్‌ను తన్నలేదని నిరూపించుకుంటుందా? లేదా తన్నిందని రుజువై తల దించుకుని వెళ్లిపోతుందా? అన్నది రేపు తేలనుంది. (చదవండి: ఆమె ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తుంది?: అవినాష్)
Comments
Please login to add a commentAdd a comment