'దేవర' ప్రీ రిలీజ్ అనుమతిపై సందేహాలు.. టాప్‌ 25 లిస్ట్‌లో సాంగ్స్‌ | Devara Pre Release Event Permission | Sakshi
Sakshi News home page

'దేవర' ప్రీ రిలీజ్ అనుమతిపై సందేహాలు.. టాప్‌ 25 లిస్ట్‌లో సాంగ్స్‌

Sep 17 2024 9:43 AM | Updated on Sep 17 2024 10:54 AM

Devara Pre Release Event Permission

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర:పార్ట్‌ 1’ సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో తారక్‌ పాల్గొంటారు కాబట్టి ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తారు. తమ దేవర మాట్లాడే మాటలు ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ ఎక్కడ నిర్వహించాలని మేకర్స్‌ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.

దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఔట్‌ డోర్‌లో నిర్వహించుకునేందుకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదని తెలుస్తోంది. తారక్‌కు ఉన్న పాపులారిటీ వల్ల దేవర ఈవెంట్‌ కోసం భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని వారు ముందే హెచ్చరిస్తున్నారట. ఓపెన్‌ ప్రదేశాల్లో కార్యక్రమం పెడితే ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువగానే అభిమానులు వచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారట. దీంతో లిమిటెడ్‌ పాస్‌లు ఇచ్చి  హైదరాబాద్‌లోని నోవాటెల్లో దేవర ప్రీ రిలీజ్‌ నిర్వహించాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారట. అయితే ,ఈ విషయం గురించి మేకర్స్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీగా నిర్వహించాలని తమ ప్రయత్నాలు  చేస్తున్నారు. సెప్టెంబర్ 22 (ఆదివారం) ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.

టాప్‌ 25 జాబితాలో నాలుగు 'దేవర' సాంగ్స్‌
ఎన్టీఆర్‌-  జాన్వీ కపూర్‌ జోడీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. దేవర నుంచి విడుదలైన అన్నీ పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌ రాబడుతూ నాలుగు పాటలు ట్రెండ్‌ అవుతున్నాయి.  టాప్‌ 25 ట్రెండింగ్‌ జాబితాలో నాలుగు స్థానాలు దేవర పాటలే ఉన్నాయి. దావూదీ (తెలుగు) తొలి స్థానం, దావూదీ (హిందీ) 7వ స్థానం, చుట్టమల్లె (తెలుగు)  18వ స్థానం, దావూదీ (తమిళ్‌) 25వ స్థానంలో దూసుకుపోతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement