రజనీ కాంత్‌ నో చెప్పిన డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చిన బాలకృష్ణ? | Did Balakrishna give director golden chance to Bobby | Sakshi
Sakshi News home page

రజనీ కాంత్‌ కాదన్న బాబీకి గోల్డెన్ ఛాన్స్‌ ఇచ్చిన బాలకృష్ణ?

Published Tue, Jun 6 2023 4:24 PM | Last Updated on Tue, Jun 6 2023 4:26 PM

Did Balakrishna give director golden chance to Bobby - Sakshi

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం NBK108. ఈ నెల 8న ఈ సినిమా టైటిల్,ఫస్ట్ లుక్‌తో పాటు మరో భారీ సర్‌ప్రైజ్‌ను అభిమానులకు ఇవ్వబోతున్నట్లుగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.  ఈ లోపు మరో వార్త సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంది. అదేమిటంటే.. NBK 109 కూడా బాలయ్య లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించే అవకాశం బాబీకి వచ్చినట్లు సమాచారం.

(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్‌’ ప్రతి థియేటర్‌లో ఆయన కోసం ఒక టికెట్‌ రిజర్వ్‌)

మెగాస్టార్‌ చిరంజీవి కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య'తో సూపర్‌ హిట్‌ కొట్టిన బాబీకి ఇది మరో గోల్డెన్‌ ఛాన్స్‌ అని ఫ్యాన్స్‌ లెక్కలు వేసుకుంటున్నారు. మొదట ఈ స్క్రిప్ట్‌ను సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బాబీ వివరించాడట.. అయితే,  రజనీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో  అదే స్క్రిప్ట్‌ని బాలయ్యకు చెప్పాడట. దీంతో బాబీ ఫుల్‌ ఖుషి అయ్యాడట.  సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నాడు. ఈ కాంబోలో మూవీ గురించి గతంలో ఆన్ స్టాపబుల్ షోకు వచ్చినప్పుడు పరస్పరం హింట్ ఇచ్చుకున్నారు. కానీ డైరెక్టర్ ఎవరన్నది అప్పుడు లాక్ చేయలేదు. యాక్షన్ ఎంటర్ ట్రైనర్‌గా కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లోనే ఇది రూపొందనుంది.

(ఇదీ చదవండి: లలితా జ్యువెలరీలో బంగారు ఆభరణాలు దొచుకున్న ఆ దొంగ కథే 'జపాన్‌'!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement