అయిదేళ్ల వయసు నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న | Kajal Aggarwal Shares She Diagnosed With Asthma at Age 5 | Sakshi
Sakshi News home page

తనకున్న వ్యాధి గురించి చెప్పిన కాజల్‌

Published Tue, Feb 9 2021 3:49 PM | Last Updated on Tue, Feb 9 2021 5:45 PM

Kajal Aggarwal Shares She Diagnosed With Asthma at Age 5 - Sakshi

టాలీవుడ్‌ భామ కాజల్‌ అగర్వాల్‌ గతేడాది అక్టోబర్‌లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటిస్తూ షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీ అయిపోయారు కాజల్‌. ఇక తనకు సంబంధించిన ప్రతి విషయాలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉండే కాజల్‌ తాజాగా ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. తనకు చిన్న వయసులోనే బ్రాంకియాల్‌ ఆస్తమా(శ్వాసకోశ వ్యాధి) ఆటాక్‌ అయినట్లు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. అయితే దీని వల్ల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేదని చెప్పారు. శీతాకాలం వస్తే ఈ వ్యాధి లక్షణాలు మరింత ఎక్కువగా అయ్యేవని ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడినట్లు తను ఎదుర్కొన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. (చదవండి: వీరిలో అసలైన కాజల్‌‌ ఎవరబ్బా: కాజల్‌ భర్త)

‘నాకు అయిదేళ్ల వయసు నుంచే బ్రాంకియాల్‌ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పటికి ఇన్‌ హేలర్‌‌ వాడుతున్న. అది చాలా బాగా పనిచేస్తుంది. అవుట్‌ డోర్‌ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు ఈ ఇన్‌హెలర్‌ను తీసుకువెళతాను. ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అయితే ఈ వ్యాధితో బాధపడేవారు మన దేశంలో ఎక్కువగానే ఉన్నారు. కానీ దీని గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కానీ ఇన్‌ హేలర్‌‌ వాడడానికి సిగ్గు పడుతుంటారు. ఇకపై అలాంటి వాటికి చెక్‌ పెట్టండి. సే ఎస్‌ టూ ఇన్‌ హేలర్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం కాజల్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఆచార్య చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక కమల్ హాసన్ ‘భారతీయుడు-2’తో పాటు హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. (చదవండి: ఫిబ్రవరి 12న కాజల్‌ ‘ప్రత్యక్ష ప్రసారం’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement