ఆసక్తికరంగా ‘లాల్‌సింగ్‌ చడ్డా’ థీమ్‌ పోస్టర్‌ | Laal Singh Chaddha Theme Poster Out | Sakshi
Sakshi News home page

Lal Singh Chaddha: ఆసక్తికరంగా ‘లాల్‌సింగ్‌ చడ్డా’ థీమ్‌ పోస్టర్‌

Published Mon, Aug 1 2022 1:09 PM | Last Updated on Mon, Aug 1 2022 2:45 PM

Laal Singh Chaddha Theme Poster Out - Sakshi

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’. కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఆమిర్‌ ఖాన్‌ ఓ నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్నాడు.ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా ఈ ‘లాల్‌సింగ్‌ చడ్డా’రూపొందింది . ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా  కీలక పాత్రలో  అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు.

(చదవండి: తన ఫస్ట్‌ లవ్‌ స్టోరిని బయటపెట్టిన మెగాస్టార్‌ చిరంజీవి..)

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి థిమ్‌ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో ఈ విచిత్రం అనే పదాలుతో తయారైనా ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement